
బుల్లితెర స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈమేరకు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది. తన భర్త మంజునాథ్ తండ్రి గారు హఠాన్మరణం చెందారని తెలుపుతూ ఆమె కలత చెందింది. ఈ క్రమంలో తన మామగారి ఫోటోను ఆమె షేర్ చేసింది. 'మిస్ యూ అంకుల్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ చెప్పుకొచ్చింది.

ఇదే సమయంలో లాస్య భర్త మంజునాథ్ కూడా తన తండ్రి గురించి ఎమోషనల్ అయ్యాడు. 'భౌతికంగా మీరు మాతో లేకపోయినా.. మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే ఉంటుంది.' అని మంజునాథ్ భావోద్వేగానికి గురైయాడు. ఆపై తన తండ్రితో దిగిని ఫోటోలను పంచుకున్నాడు. ఆయన మరణానికి కారణాలు తెలుపలేదు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించి ఉంటారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment