Sakshi News home page

Ayodhya: అయోధ్య అణువణువు రామమయం!

Published Wed, Apr 17 2024 8:07 AM

Ayodhya Ram Navami 2024 Celebrations - Sakshi

అయోధ్యలోని నూతన రామాలయంలో తొలి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.  ఈ శ్రీరామ నవమి అయోధ్యకు చారిత్రకమైనదికానుంది. నేడు శ్రీరాముడు సూర్య తిలకం ధరించనున్నాడు. 
 

శ్రీరామ నవమి సందర్భంగా రామ్‌లల్లా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే రామభక్తులు సరయూలో స్నానాలు చేసి, ఆలయానికి తరలివస్తున్నారు.

శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా హనుమాన్ గర్హిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు.

అయోధ్యలో భద్రతా ఏర్పాట్ల గురించి అయోధ్య రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అయోధ్యలోని రామాలయ పరిసరాలను రెండు సెక్టార్లుగా విభజించి, నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.

తెల్లవారుజామున 3:30 గంటల నుంచి బాలరాముని దర్శనం ప్రారంభమైంది. రామాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు రామాయణాన్ని భక్తులు తిలకిస్తున్నారు. ఈ ప్రత్యేక రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్ దంపతులు ట్రస్ట్‌కు అందించారు.

Advertisement
Advertisement