డికాక్‌, డస్సెన్‌ అద్భుతంగా ఆడారు.. ఇక మేం సెమీస్‌కు చేరినట్లే: బవుమా | Sakshi
Sakshi News home page

CWC 2023: న్యూజిలాండ్‌పై విజయానంతరం సౌతాఫ్రికా కెప్టెన్‌ బవుమా కామెంట్స్‌

Published Thu, Nov 2 2023 8:44 AM

CWC 2023: South Africa Captain Temba Bavuma Comments After Win Against New Zealand - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టి అద్భుత విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ప్రొటీస్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరడంతో పాటు సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.   

న్యూజిలాండ్‌పై విజయానంతరం సఫారీ కెప్టెన్‌ టెంబా బవుమా మాట్లాడుతూ.. ఈ గెలుపు మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఓవరాల్‌గా అదిరిపోయే ప్రదర్శన. డికాక్‌, డస్సెన్‌ అద్భుతంగా ఆడారు. మంచి భాగస్వామ్యాన్ని అందించారు. మా బౌలర్లు అనుకున్న ప్రకారం​ ప్లాన్‌ పక్కాగా అమలు చేశారు. 

ఇన్నింగ్స్‌ ఆరంభంలో నేను, క్విన్నీ (డికాక్‌) పరిస్థితులను అంచనా వేసేందుకు నిదానంగా ఆడాం. చెడ్డ బంతులను బౌండరీలకు తరలించాం. క్విన్నీ 30వ ఓవర్ వరకు నిదానంగా ఆడి, ఆ తర్వాత మా బిగ్ హిట్టర్‌లతో కలిసి చెలరేగిపోయాడు. న్యూజిలాండ్‌ బౌలర్లు మాపై ఎదురుదాడికి దిగుతారని తెలుసు. అలా జరిగితేనే మాకు అవకాశాలు వస్తాయని అంచనా వేశాం.

గత కొంతకాలంగా మేం ఆచరిస్తున్న వ్యూహాలే ఈ మ్యాచ్‌లోనూ అమలు చేశాం. ఈ విజయం మాకు సెమీస్‌ స్థానాన్ని ఖరారు చేసేలా కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నాం. తదుపరి జరిగే మ్యాచ్‌లపై మరింత ఫోకస్‌ పెంచుతామని అన్నాడు. 

కాగా, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. డికాక్‌ (114), డస్సెన్‌ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌.. కేశవ్‌ మహారాజ్‌ (4/46), మార్కో జన్సెన్‌ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (60), విల్‌ యంగ్‌ (33), డారిల్‌ మిచెల్‌ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

Advertisement
Advertisement