'ప్రముఖ నటి ఇంట్లో అశ్లీల చిత్రాలను షూట్‌ చేసిన నటుడు' | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటి ఇంట్లో అశ్లీల చిత్రాలను షూట్‌ చేసిన నటుడు: సుచిత్ర

Published Thu, May 16 2024 2:06 PM

Bayilvan Ranganathan Not Any Comments Vanitha

కొంతకాలంగా కోలీవుడ్‌లో టాప్‌ సింగర్‌గా నిలిచిన సుచిత్ర.. సుచీ లీక్స్‌ వ్యవహారం తర్వాత ఎన్నో వివాదాల్లో ఇరుక్కుని, సింగర్‌ అనే విషయం మరిచిపోయింది. సుచీ లీక్స్ ఇష్యూ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న సుచిత్ర.. ఇప్పుడు రకరకాల వివాదాస్పద కామెంట్లు చేస్తూ కోలీవుడ్‌లో పెను తుఫాను సృష్టిస్తోంది. ప్రస్తుతం వరుసగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్‌గా మారారు.

అందుకు తగ్గట్టుగానే తన మాజీ భర్త కార్తీక్ కుమార్ స్వలింగ సంపర్కుడని, ధనుష్‌తో తనకున్న రిలేషన్ షిప్ గురించి మాట్లాడిన సుచిత్ర.. కోలీవుడ్‌లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా ఉందని, కమల్ బర్త్ డే పార్టీల్లో వెండి తాంబూలాల్లో కొకైన్ వడ్డించారని ఇలా సెన్సేషనల్‌ కామెంట్లు చేస్తుంది. అంతే కాకుండా సుచీ లీక్స్ ఇష్యూలో వచ్చిన ఫోటోలను త్రిష తనకు ఇచ్చిందని సుచి చెప్పడం చాలా మందిని షాక్‌కు గురి చేసింది.

తాజాగా వనిత విజయకుమార్ గురించి సుచిత్ర పలు వ్యాఖ్యలు చేసింది. అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వనితా విజయకుమార్‌ ఇంటిని తమిళ నటుడు బైల్వాన్‌ ఉపయోగించాడని సుచిత్ర తెలిపింది. ఒక బంగ్లాను వనితకు తన సిన్నిహితులు ఇస్తే.. దానిని నటుడు బైల్వాన్‌కు ఆమె ఇచ్చినట్లు సుచి తెలిపింది. అయితే ఆ బంగ్లాను అశ్లీల చిత్రాల షూటింగ్‌ కోసం వాడినందుకే సీల్‌ వేశారని సుచిత్ర పేర్కొంది. బైల్వాన్ అందరి గురించి కామెంట్లు చేస్తాడు కానీ, వనిత గురించి మాత్రం ఎక్కడా మాట్లడరు. దీనికి కారణం ఈ బంగ్లా కథే అంటూ సుచి చెప్పింది.

బైల్వాన్ రంగనాథన్ అశ్లీల సినిమాలకు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని, తనకు ప్లేబ్యాక్ సింగర్ కాకముందే ఈ విషయాలన్నీ తెలుసని సుచిత్ర తెలిపింది. శరత్‌కుమార్, రాధా రవి వంటి వారు తమిళనాడులో ఇలాంటి అసభ్యకర చిత్రాలను తెరకెక్కించకుండా అడ్డుకున్నారని కూడా ఆమె గుర్తు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌ సెలబ్రిటీలకు నిద్రలేకుండా సుచిత్ర చేస్తుంది. ఎప్పుడు ఎవరిని టార్గెట్‌ చేస్తుందో తెలియక భయంతో ఉన్నారని చెప్పవచ్చు. సుచిత్ర వెనుక ఎవరో ఉండే ఈ కథ నడుపుతున్నారని కూడా రూమర్స్‌ వస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement