71.85 % ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

71.85 % ఓటింగ్‌

Published Wed, May 15 2024 5:55 AM

-

మానుకోట పార్లమెంట్‌ పరిధిలో

ఓటర్లు 15,32,366

ఓటు హక్కు వినియోగించుకున్నవారు 11,01,030

మహిళల ఓటింగ్‌ శాతమే ఎక్కువ

మహబూబాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సోమవారం ముగిసింది. మానుకోట సెగ్మెంట్‌లో 71.85శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 15,32,366 మంది ఓటర్లు ఉండగా.. 11,01,030మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుష ఓటర్లు 5,42,304మంది, మహిళా ఓటర్లు 5,58,678 మంది, ఇతరులు 48 మంది ఓటు వేశా రు. మొత్తంగా మహిళల ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉంది.

భద్రాచలంలో తక్కువ..

మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అధికశాతం పోలింగ్‌ నమోదు కాగా.. భద్రాచలంలో తక్కువశాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా నర్సంపేట తర్వాత డోర్నకల్‌ నియోజకవర్గంలో అధిక శాతం పోలింగ్‌ నమోదైనట్లు చెప్పారు.

అభ్యర్థుల్లో టెన్షన్‌..

జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కంపు ఉండగా.. అప్పటి వరకు అభ్యర్థులకు టెన్షన్‌ తప్పదు. ఈవీఎంల్లో వారి భవిత్యం ఉండగా.. వాటిని జిల్లా కేంద్రంలోని సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాల స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపరిచారు. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. వచ్చే 4న ఈ పాఠశాలలోనే కౌంటింగ్‌ ఉంటుందని అధికారులు తెలిపారు.

పార్లమెంట్‌ పరిధిలో నియోజకవర్గాల వారీగా ఓటర్లు, ఓటింగ్‌ శాతం

నియోజకవర్గం మొత్తం ఓటర్లు ఓటువేసిన వారు పోలింగ్‌ శాతం

డోర్నకల్‌ 2,22,906 1,68,053 75.39

మానుకోట 2,58,850 1,84,410 71.24

నర్సంపేట 2,35,849 1,80,659 76.60

ములుగు 2,33,191 1,62,443 69.66

పినపాక 2,03,790 1,41,432 69.40

ఇల్లెందు 2,25,097 1,58,650 70.48

భద్రాచలం 1,52,683 1,05,383 69.02

మొత్తం 15,32,366 11,01,030 71.85

Advertisement
 
Advertisement
 
Advertisement