బీభత్సం | Sakshi
Sakshi News home page

బీభత్సం

Published Thu, May 16 2024 1:10 PM

బీభత్

జయపురం పట్టణాన్ని ఈదురుగాలులు వణికించాయి. కాలవైశాఖి నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. హోర్డింగులు, ఇళ్ల పైకప్పులు గాలుల ధాటికి ఎగిరిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెహ్రూనగర్‌లో మోకాలిలోతు నీరు ప్రవహించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో సరఫరా లేక అంధకారంలో మగ్గిపోయారు. బుధవారం ఉదయం మున్సిపల్‌ కార్యనిర్వాహక అధికారి సిద్దార్ధ పట్నాయక్‌ సిబ్బందితో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై పడిన హోర్డింగ్‌లు, చెట్ల కొమ్మలు తొలగించారు. – జయపురం

రహదారిపై కూలిన చెట్టు

బీభత్సం
1/1

బీభత్సం

Advertisement
 
Advertisement
 
Advertisement