బీఆర్‌ఎస్‌ అద్భుత విజయం సాధించబోతోంది: కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అద్భుత విజయం సాధించబోతోంది: కేసీఆర్‌

Published Sat, May 11 2024 3:43 PM

KCR Press Meet At Telangana Bhavan On Lok Sabha Elections

సాక్షి,హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అద్భుత విజయం  సాధించబోతోందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌  అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం(మే11) తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్‌  మాట్లాడారు.

‘ప్రజాగ్రహం కాంగ్రెస్‌ను ముంచేయబోతోంది. కరెంటు విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. రెండు జాతీయ పార్టీలను మించి సీట్లు గెలవబోతున్నాం. చిల్లర రాజకీయాల కోసం టైమ్‌ వేస్ట్‌ చేశారు.  కరెంట్‌ను ఎందుకు దెబ్బతీశారో అర్థం కావడం లేదు. నేనుండే చోట 7-8సార్లు కరెంటు పోయింది.

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత  కాం గ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వస్తారా.. బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళతారా చూద్దాం. పైన తథాస్తు దేవతలు ఉంటారు. ఏదైనా జరగొచ్చు. కేసులు అటు ఇటైతే రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళతాడు. 26 నుంచి 32 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మా వాళ్లతో టచ్‌లో ఉన్నారు. ఇద్దరం కలిసి గవర్నమెంట్‌ ఫాం చేద్దామంటున్నరు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొన్ని అద్భుత పథకాలు తీసుకొచ్చారు. మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్,  సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలను  ప్రవేశ పెట్టారు’ అని కొనియాడారు. 

బీఆర్‌ఎస్‌ అద్భుత విజయం సాధించబోతోంది: కేసీఆర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement