రిగ్గింగ్‌ జరిగింది.. రీపోలింగ్‌ జరపాల్సిందే: మంత్రి అంబటి | Sakshi
Sakshi News home page

రిగ్గింగ్‌ జరిగింది.. రీపోలింగ్‌ జరపాల్సిందే: మంత్రి అంబటి

Published Tue, May 14 2024 12:40 PM

Minister Ambati Rambabu Comments On Police And TDP

సాక్షి, పల్నాడు జిల్లా: సీఎం జగన్‌ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్దసంఖ్యలో ఓటేశారన్నారు. ‘‘పోలింగ్‌ శాతం పెరగటం అంటే అది పాజిటివ్‌ ఓటింగ్‌. మహిళా సాధికారత కోసం సీఎం జగన్‌ కృషి చేశారు. మహిళలంతా సీఎం జగన్‌కే ఓటు వేశారు. రాష్ట్యవాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించింది’’ అంబటి రాంబాబు అన్నారు.

టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. మేం ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. టీడీపీతో పోలీసులు కుమ్మక్కైయ్యారా?’’ అంటూ అంబటి నిలదీశారు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. మా కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. ఒక బూత్‌లో వెయ్యి ఓట్లు రిగ్గింగ్‌ చేశారు. రీపోలింగ్‌ నిర్వహించబోమన్న మాట సరికాదు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్‌ జరిగిన పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

‘‘ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఐదేళ్లపాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నిక. చంద్రబాబు, జగన్ పాలన చూసినవారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగింది. మహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూత్ లకు చేరుకున్నారు. తమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారు’’ అని అంబటి చెప్పారు.

ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి సీఎం జగన్‌ కోసం తాపత్రయపడి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు 70 శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు. అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇచ్చి వారి సాధికారతకు కృషి చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదు. జగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

అక్కడ రీ-పోలింగ్ ?

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఎవరు ప్రయత్నాలు చేసినా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారు. సత్తెనపల్లి లోనూ నేను భారీ మెజారిటీతో గెలవబోతున్నాను. ఏ ఎన్నికల్లోనూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగింది. డీజీపీ, ఐజీ, ఐపీఎస్ లను మార్చారు. ఇంతమందిని మార్చినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు. లా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడలేదు. గొడవలు జరిగినపుడు పోలీసులకు ఫోన్ చేసినా గంటల తరబడి రీచ్ కాలేదు. పోలీసులు అట్టర్ ఫెయిల్ అయ్యారు’’ అంబటి దుయ్యబట్టారు.


దాడులు జరిగిన తర్వాత చాలాసేపటికి పోలీసులు వచ్చారు. నకిరేకల్ ఎస్‌ఐ నన్ను అక్కడ తిరగటానికి వీల్లేదన్నారు. ఎస్పీకి కాల్ చేస్తే నన్ను ఇంటికి వెళ్లిపోమన్నారు. కానీ నియోజకవర్గంలో నీ చాలా ప్రాంతాల్లో కన్నా లక్ష్మీ నారాయణ తిరిగారు.  మీ అంతు తేల్చుతా అంటూ కన్నా కుమారుడు ఓటర్లను బెదిరించారు. రూరల్ సీఐ రాంబాబు టీడీపీతో కలిసిపోయాడు. టీడీపీ వద్ద డబ్బులు తీసుకుని వారికి పనిచేశాడు’’ అని అంబటి నిప్పులు చెరిగారు.

‘‘దమ్మాలపాడు బూత్‌లో పోలీసులను మేనేజ్ చేసి ఓట్లు వేయించారు. ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేశాను. రీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నాను. నా అల్లుడు ఉమేష్ కారుపై దాడి చేశారు. చీమలమర్రి, దమ్మాలపాడు, నాగనుపాడు, గుల్లపల్లి, మాదల సహా అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ సక్రమంగా జరగలేదు. ఎలక్షన్ కమిషన్‌ను అక్కడి కెమెరాలు పరిశీలించాలని కోరుతున్నాను. కొన్నిచోట్ల పోలింగ్ ఆఫీసర్స్ కొల్యూడ్ అయిపోయారు. ఎవరి ఓటు వాళ్లు వేస్తే సమస్య లేదు. అందరి ఓటు ఒక్కరే వేస్తే అది పద్ధతి కాదు.. ఎలక్షన్ అథారిటీస్‌కి ఫిర్యాదు చేశాను. చంద్రబాబు మోసగాడు.. ప్రజల్ని 14ఏళ్లు మోసం చేశాడు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన మొనగాడు జగన్. మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


 

 

 

 

 

 

 

 


 

Advertisement
 
Advertisement
 
Advertisement