వైఎస్సార్‌ సీపీ గెలుపు తథ్యం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ గెలుపు తథ్యం

Published Sat, Apr 20 2024 1:40 AM

- - Sakshi

సంతనూతలపాడు (చీమకుర్తి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన ప్రభంజనం సృష్టిస్తూ దూసుకెళ్తోందని, రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు తథ్యమని నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున, బాపట్ల పార్లమెంట్‌ పరిశీలకుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. సంతనూతలపాడు పంచాయతీ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో శుక్రవారం వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ దుంపా చెంచిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మోదుగుల మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారని.. చంద్రబాబు తన పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని చెప్పారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ఉత్తుత్తి వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ముందుకొస్తున్నారని ఎద్దేవా ఏశారు. సీఎం జగన్‌ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగార్జునను, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్‌ను గెలిపించాలని కోరారు.

మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ బలంగా ఉందని, పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈనెల 24 న చీమకుర్తిలో తాను నామినేషన్‌ వేస్తానని, నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మారెళ్ళ బంగారు బాబు, ఎంపీపీ బీ విజయ, జెడ్పీటీసీలు దుంపా రమణమ్మ, వేమా శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు బొల్లినేని కృష్ణయ్య, సొసైటీ ప్రెసిడెంట్‌ దుంపా యలమందారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేషన్‌ చైర్మన్‌, డైరెక్టర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్‌ ఎంపీపీలు, పేర్నమిట్టలోని 6 డివిజన్ల కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జేసీఎస్‌ కన్వీనర్లు, చీమకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పీఏసీఎస్‌ త్రి మెన్‌ కమిటీ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, పాల్గొన్నారు.

సంతనూతలపాడులో విజయం సాధించి జగనన్నకు బహుమతిగా ఇస్తాం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి పార్టీ కార్యాలయం ప్రారంభం

Advertisement
Advertisement