కేసీఆర్‌కు నీరాజనం | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు నీరాజనం

Published Thu, May 9 2024 10:10 AM

కేసీఆర్‌కు నీరాజనం

గజ్వేల్‌లో ఘన స్వాగతం

గజ్వేల్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గజ్వేల్‌లో ఘన స్వాగతం లభించింది. నర్సాపూర్‌ ఎన్నికల ప్రచారసభకు వెళ్లే క్రమంలో బుధవారం సాయంత్రం పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా బస్సులో నుంచే కార్యకర్తలు, నాయకులు అభివాదం చేశారు. అప్పటికే గంటకుపైగా వేచి చూస్తున్న ప్రజలు కేసీఆర్‌ రావడంతో ఒక్కసారిగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి బస్సులోకి వెళ్లి కొద్దిసేపు మాట్లాడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సరళిని కేసీఆర్‌ ప్రతాప్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ శీరీష మంగళ హారతులతో స్వాగతం పలికారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ రజిత, మరికొంత మంది మహిళలు కేసీఆర్‌ను కలిశారు. అంతకుమందు మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం చౌరస్తాలో కొద్దిసేపు ఆగి అభివాదం చేసి వెళ్లారు.

Advertisement
 
Advertisement
 
Advertisement