అందుకే రాహుల్‌ను సెలక్ట్ చేయలేదు.. పంత్‌, సంజూకు: అగార్కర్ | Sakshi
Sakshi News home page

అందుకే రాహుల్‌ను సెలక్ట్ చేయలేదు.. పంత్‌, సంజూకు: అగార్కర్

Published Thu, May 2 2024 6:15 PM

India T20 World Cup 2024 Squad Press Conference: Ajit Agarkar Explains Why KL Rahul Missed Out In India's T20 World Cup Squad

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ జ‌ట్టు  ఎంపికపై భిన్న‌భిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ముఖ్యంగా స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌ను వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక చేయ‌కపోవ‌డం క్రీడా వ‌ర్గాల్లో తీవ్ర‌ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే ఈ మెగా టోర్నీకి రాహుల్‌ను సెల‌క్ట్ చేయ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని తాజాగా బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ వెల్ల‌డించాడు.

మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ తమకు కావాలనుకున్నామని, అందుకే రాహుల్‌ను ఎంపిక చేయలేదని అగార్కర్ చెప్పుకొచ్చాడు.

"రాహుల్ టీ20ల్లో ఎక్కువ‌గా టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మేము మిడిల్ ఆర్డ‌ర్‌లో బ్యాటింగ్ చేసే వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ను ఎంపిక చేయాల‌న‌కున్నాం. అందుకే రాహుల్‌ను ప‌క్క‌న పెట్టి సంజూ శాంస‌న్‌, రిష‌బ్ పంత్‌ల‌కు స్పెష‌లిస్టు వికెట్ కీప‌ర్‌ బ్యాట‌ర్ల‌గా ఎంపిక చేశాము. 

వీరిద్ద‌రికి మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే స‌త్తా ఉంద‌ని" ప్రెస్‌కాన్ఫ‌రెన్స్‌లో అగార్కర్ పేర్కొన్నాడు. ఈ ప్రెస్‌కాన్ఫ‌రెన్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోన్నాడు.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్‌ సిరాజ్.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement