ఘనంగా మహర్షి భగీరథ జయంతి | Sakshi
Sakshi News home page

ఘనంగా మహర్షి భగీరథ జయంతి

Published Wed, May 15 2024 1:20 AM

ఘనంగా మహర్షి  భగీరథ జయంతి

వనపర్తి: మహర్షి భగీరథ జయంతిని మంగళవారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మర్రికుంట సమీపంలోని మహర్షి భగీరథ విగ్రహానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్‌ నాయకులతో కలిసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగీరథుడు పట్టుదలతో తపస్సు చేసి దివి నుంచి భువికి గంగను రప్పించారని గుర్తుచేసుకున్నారు.

పట్టుదలకు మారుపేరు..

మహర్షి భగీరథుడు పట్టుదలకు మారుపేరుగా చెప్పుకోవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాగవరం చౌరస్తాలో ఉన్న భగీరథుడి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. పితృదేవతల కోరిక మేరకు గంగను భూమిపైకి రప్పించేందుకు తపస్సు చేసినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement