మూడంచెల భద్రత | Sakshi
Sakshi News home page

మూడంచెల భద్రత

Published Thu, May 16 2024 12:00 PM

మూడంచ

ఉండి: సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు చేర్చి మూడంచెల పటిష్ట ఽభద్రత ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ సీవీ ప్రవీణ్‌ ఆదిత్య బుధవారం తెలిపారు. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు జరుగనున్న దృష్ట్యా ఇంకా 19 రోజుల వ్యవధి ఉందన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌రూములకు కట్టుదిట్టంగా భధ్రత ఏర్పాటు చేశామని, స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయ న్నారు. అగ్నిప్రమాదాలకు అవకాశం లేకుండా అగ్నిమాపక అధికారులు సైతం అందుబాటు ఉంటారన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఒక సీఐ, నలుగురు ఎస్సైలతో పాటు ఇతర సిబ్బందితో 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు.

స్ట్రాంగ్‌రూమ్స్‌ వద్ద పటిష్ట బందోబస్తు

భీమవరం: జిల్లావ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎం బాక్సులను భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, విష్ణు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచినట్టు జిల్లా ఎస్పీ అజిత బుధవారం తెలిపారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ఏర్పాటుచేసిన మూడంచెల కేంద్ర పోలీస్‌ బలగాలు, జిల్లా ఆర్మ్‌డ్‌ పోలీస్‌, సివిల్‌ పోలీస్‌ బందోబస్తును పరిశీలించి ఆమె సూచనలు, ఆదేశాలను జారీ చేశారు. స్ట్రాంగ్‌ రూమ్స్‌కు నలువైపులా పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటుచేశామని, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెరు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలకు కూడా తావు ఇవ్వరాదన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలనీ ఆదేశించారు.

మూడంచెల భద్రత
1/1

మూడంచెల భద్రత

Advertisement
 
Advertisement
 
Advertisement