అజియో బిగ్‌ బోల్డ్‌ సేల్‌ షురూ | Sakshi
Sakshi News home page

11 నుంచి 15 వరకూ భారీ సేల్‌

Published Thu, Jun 11 2020 7:04 PM

AJIO.com Presents Big Bold Sale - Sakshi

ముంబై : ప్రముఖ ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ ఈ-రిటైలర్‌ అజియో.కాం ఈనెల 11 నుంచి 15 వరకూ ‘బిగ్‌ బోల్డ్‌ సేల్‌’ ను ప్రకటించింది. స్టైల్‌, కమ్‌ఫర్ట్‌ను కోరుకునే కస్టమర్లందరికీ బోల్డ్‌ స్టైల్స్‌ను భారీ డిస్కౌంట్లతో బిగ్‌ బోల్డ్‌ సేల్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. 2000కు పైగా బ్రాండ్స్‌ నుంచి 2,00,000 స్టైల్స్‌ ఇంతకుముందెన్నడూ లేని డిస్కౌంట్‌ ఆఫర్లతో సేల్‌లో సిద్ధంగా ఉన్నాయని అజియో.కాం వెల్లడించింది. నైక్‌, ప్యూమా, అదిదాస్‌, లెవీస్‌ వంటి దిగ్గజ బ్రాండ్లు అజియో బిగ్‌ బోల్డ్‌ సేల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

ఇక 50 నుంచి 90 శాతం వరకూ డిస్కౌంట్లతో పాటు టీ షర్ట్స్‌, జీన్స్‌, కుర్తాలపై ఆకర్షణీయ ఫ్లాష్‌ డీల్స్‌ ఉంటాయని వెల్లడించింది. సేల్‌లో భాగంగా పలు అంతర్జాతీయ బ్రాండ్లను లాంఛ్‌ చేస్తామని పేర్కొంది. 2016లో డౌట్‌ ఈజ్‌ ఔట్‌ అంటూ ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అజియో ప్రపంచ ఫ్యాషన్ పోకడలకు పర్యాయపదంగా నిలిచింది.

చదవండి : లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మెరిసిన ‘రకుల్‌’

Advertisement
 
Advertisement
 
Advertisement