అల్లంతో ఇలా చేస్తే పొడవైన జుట్టు మీ సొంతం! | Sakshi
Sakshi News home page

అల్లంతో ఇలా చేస్తే పొడవైన జుట్టు మీ సొంతం!

Published Wed, Jan 17 2024 5:49 AM

Amazing Benefits Of Ginger For Hair Growth  - Sakshi

ఆయుర్వేద పరంగా అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు ఈ అల్లం సులభంగా చెక్‌పెడుతుంది. అలాంటి అల్లం జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుందా? అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా!. అందులోనూ అల్లం ఘాటు ఓ రేంజ్‌లో ఉంటుంది. దాన్ని జుట్టుకి అప్లై చేస్తే వేడి చేస్తుంది కదా!. మరీ అలాంటి అల్లం ఎలా జట్టు పోషణకు ఉపపయోగపడుతుంది అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే నిపుణులు మాత్రం అల్లం కురులను స్ట్రాంగ్‌గా చేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇదేలా శిరోజాలకు పనిచేస్తుంది ఎలా జుట్టుకి అప్లై చేయాలి తదితరాల గురించి తెలుసుకుందాం!

అల్లంలో జింక్, మెగ్నీషియం ఉంటాయి. అందువల్ల ఈ అల్లం రసాన్ని జుట్టు అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు బలంగా మారుతుంది. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాల వల్ల జుట్టు బలంగా మారుతుంది.

ఎలా తలకు అప్లై చేయాలంటే..

  • ఇందుకోసం ముందుగా ఆలివ్ నూనె తీసుకుని అందులో అల్లం రసం కలపండి. దీనిని జుట్టుకి అప్లై చేసి రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే జుట్టుని క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే జుట్టు మెరుస్తుంది. పొడి జుట్టుకి అల్లం రసాన్ని అప్లై చేసి గంటపాటు అలానే ఉంచి, ఆ తర్వాత షాంపూ, కండీషనర్‌తో క్లీన్ చేసుకోవాలి.
  • అల్లం రసాన్ని జుట్టుకి వాడడం వల్ల హెల్దీగా ఉండే పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. అంతేగాదు దీని వల్ల జుట్టుకి మరిన్ని లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. పైగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గస్తుంది. కాబట్టి, జుట్టుకి అల్లాన్ని రెగ్యులర్‌గా అప్లై చేయండి.
  • అలాగే తలపై దురద , చిన్న చిన్న పొక్కులు వంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది కూడా. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పొక్కులని దూరం చేస్తాయి.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

(చదవండి: మసాలా దినుసుల ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్‌ చేయండి!)

Advertisement
Advertisement