Sakshi News home page

కథర్నాక్‌.. స్టోరీ టెల్లింగ్‌ మంత్ర

Published Wed, Apr 17 2024 10:31 AM

Storytelling Manthra Wins Marketing - Sakshi

‘కథలు చెప్పకు’ అని పేరెంట్స్‌తో, ఫ్రెండ్స్‌తో సుతిమెత్తని తిట్లు తినని వారు యూత్‌లో తక్కువగానే ఉంటారు. అయితే ప్రసిద్ధ బ్రాండ్స్‌ మాత్రం ‘కథలు చెప్పండి ప్లీజ్‌’ అంటూ యంగ్‌ టాలెంట్‌కు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రకటనలకు సంబంధించి ఎఫెక్టివ్‌ స్టోరీ టెల్లింగ్‌ అనేది బ్రాండ్స్‌కు, కన్జ్యూమర్‌లకు మధ్య బలమైన వారధిగా మారింది. రకరకాల బ్రాండ్‌లకు  సంబంధించి భావోద్వేగాలతో మిళితమైన యాడ్స్‌ యువ సృజనకారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

అమూల్‌ బ్రాండ్‌ ‘అమూల్‌ గర్ల్‌’ ద్వారా సమకాలీన సంఘటనలతో కనెక్ట్‌ కావడానికి చేస్తున్న టాపికల్‌ యాడ్స్‌  పాపులర్‌ అయ్యాయి. నగల బ్రాండ్‌ ‘తనిష్క’ తమ వ్యాపార ప్రకటనల్లో ‘స్టోరీ టెల్లింగ్‌’ ఫార్మట్‌ను బలంగా ఉపయోగించుకుంటుంది. ఇక ‘లైఫ్‌బాయ్‌’ దగ్గరకు వస్తే... ఎఫెక్టివ్‌ స్టోరీ టెల్లింగ్‌ అనేది ్ర పాడక్ట్‌ను ప్రమోట్‌ చేయడానికే కాదు పబ్లిక్‌ హెల్త్‌ అవేర్‌నెస్‌ విషయంలోనూ ఉపయోగపడుతుందనేది అర్థమవుతుంది.

శాస్త్ర, సాంకేతిక విషయాలపై వినియోగదారుల్లో ఆసక్తి కలిగించడానికి, పెంచడానికి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్, స్టేజ్‌డ్‌ విజువల్స్‌ను ఉపయోగించుకుంటుంది అమెరికన్‌ మల్టీనేషనల్‌ కంపెనీ జనరల్‌ ఎలక్ట్రిక్‌. బ్రాండ్‌లు విస్తృత స్థాయిలో కన్జ్యూమర్‌లతో కనెక్ట్‌ కావడానికి తమ ప్రాడక్ట్‌కు సంబంధించిన అడ్వర్‌టైజింగ్‌ విషయంలో భావోద్వేగాలతో కూడిన ఎఫెక్టివ్‌ స్టోరీ టెల్లింగ్‌ను కోరుకుంటున్నాయి. అడ్వర్‌టైజింగ్‌ ప్రపంచంలో స్ట్రాటజిక్‌ స్టోరీ టెల్లింగ్‌ అనేది కీలకంగా మారింది. ఈ పవర్‌ఫుల్‌ టూల్‌ బ్రాండ్స్‌కు, కన్జ్యూమర్‌లకు మధ్య బలమైన వారధిగా మారింది.

సర్వేల ప్రకారంప్రాడక్ట్‌లకు సంబంధించి సంప్రదాయ అడ్వర్‌టైజింగ్‌ల కంటే మిత్రుల మాటలనే విశ్వసిస్తోంది యువత. వారిలో నమ్మకం కలిగించాలంటే యాడ్‌ అనేది యూత్‌ఫుల్‌గా, మిత్రుడు కొత్త విషయం చెప్పినట్లుగా ఉండాలి. ఇందుకోసం బ్రాండ్స్‌ యువ స్టోరీ టెల్లర్స్‌ను  ఉపయోగించుకుంటున్నాయి. వారి స్టోరీ టెల్లింగ్‌లోని తాజాదనానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.

థీమ్‌ను గుర్తించడం, సెంట్రల్‌ క్యారెక్టర్స్‌ను డిజైన్‌ చేసుకోవడం, కస్టమర్‌ల హృదయాలను తాకేలా యాడ్‌ను తీర్చిదిద్దడం అనేవి స్టోరీ టెల్లింగ్‌లో కీలక విషయాలు. ఇలాంటి విషయాలలో యువ సృజనకారులు తమలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ డిజిటల్‌ శకంలో స్టోరీ టెల్లింగ్‌ అనేది కొత్త రూ పాలతో సృజనాత్మకంగా వికసిస్తోంది. వర్చువల్‌ రియాలిటీ(వీఆర్‌), ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), గేమింగ్‌ టెక్నాలజీ... మొదలైనవి స్టోరీ టెల్లింగ్‌లో కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి.

‘స్టోరీ టెల్లింగ్‌ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది బలమైన సాధనం. టార్గెట్‌ ఆడియెన్స్‌ను మెప్పించేలా స్టోరీ టెల్లింగ్‌ కోసం ఏ.ఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. పవర్‌ఫుల్‌ స్టోరీ టెల్లింగ్‌ ఉనేది బలమైన భావోద్వేగాల సమ్మేళనం’ అంటున్నాడు ‘పోకో’ ఇండియా కంట్రీ హెడ్‌ హిమాన్షు టాండన్‌.

సినిమాల నుంచి ఇంటర్వ్యూల వరకు యూట్యూబ్‌ వీడియోలు చూస్తున్నప్పుడు ప్రకటనలు ప్రత్యక్షమైతే చిరాగ్గా అనిపిస్తుంది. కోల్‌కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నివేదిత మాత్రం పనిగట్టుకొని రకరకాల అడ్వర్‌టైజ్‌మెంట్స్‌ను చూస్తుంటుంది. ‘ఒకప్పటి వ్యా పార ప్రకటనల్లో వారి బ్రాండ్‌కు  సంబంధించిన గోల మాత్రమే ప్రధానంగా కనిపించేది. ఇప్పటి ప్రకటనల్లో మాత్రం ఇంటలెక్చువల్‌ ఫ్లేవర్, క్రియేటివిటీ కనిపిస్తోంది. వాటిని చూస్తుంటే ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. నాకు కూడా రకరకాల ఐడియాలు వస్తుంటాయి’ అంటుంది నివేదిత.

ముంబైకి చెందిన ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ వికాస్‌ స్టోరీ టెల్లింగ్‌ ఫార్మాట్‌లో ‘నేను అయితే ఈ యాడ్‌ను ఇలా తీస్తాను’ అంటూ నోట్స్‌ రాసుకోవడం అలవాటు. ఒక్కముక్కలో చె΄్పాలంటే నివేదిత, వికాస్‌లాంటి యువ ఉత్సాహవంతులను బ్రాండ్స్‌ కోరుకుంటున్నాయి. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతిభను నిరూపించుకుంటే ఇక వారికి తిరుగేలేదు.

స్టోరీ టెల్లింగ్‌ మంత్ర

యాడ్‌లో స్టోరీ టెల్లింగ్‌ ఫార్మట్‌ అనేది కంపెనీకి, కస్టమర్‌లకు మధ్య భావోద్వేగాలతో కూడిన ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఎక్కడ.. ఎలా... ఎంత చెప్పాలో అంతే చెప్పాలనేది స్టోరీ టెల్లింగ్‌లో భాగం. మిస్‌ ఫైర్‌ అయితే మొదటికే మోసం వస్తుంది. ప్రకటనలకు సంబంధించి కొన్ని కంపెనీలు విఫలం కావడానికి కారణం... తమ ప్రాడక్ట్‌ గురించి తప్ప కన్జ్యూమర్‌ గురించి పట్టించుకోకపోవడం. అందుకే కన్జ్యూమర్‌ను హీరో చేసేలా స్టోరీ బిల్డ్‌ చేయాలి అనేది ముఖ్యమైన స్టోరీ టెల్లింగ్‌ మంత్ర. ‘ఫలానా యాడ్‌ ఎందుకు విఫలమైంది’ అనే విషయంలో యువ సృజనకారులు పోస్ట్‌మార్టం చేయడంతో  పాటు ఒక యాడ్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంలోని కీలక అంశాలను ఔ పాసన పడుతున్నారు. ‘వాట్‌ మేక్స్‌ ఏ గ్రేట్‌ స్టోరీ’ అనే కోణంలో కస్టమర్‌ ఛాలెంజ్‌లను అధ్యయనం చేస్తున్నారు.

Advertisement
Advertisement