Sakshi News home page

April 17th AP Election News Updates: ఏపీ ఎన్నికల సమాచారం.. ఎప్పటికప్పుడు

Published Wed, Apr 17 2024 7:11 AM

AP Elections 2024: Political News In Telugu On April 17th Updates - Sakshi

April 17th AP Elections 2024 News Political Updates..

09:32 PM, Apr 17th, 2024
కృష్ణాజిల్లా: చంద్రబాబు, పవన్‌లకు షాక్‌

  • మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో చంద్రబాబు పవన్‌లకు షాక్
  • సభను పట్టించుకోకుండా మద్యం షాపులకు క్యూ కట్టిన జనసేన, టీడీపీ శ్రేణులు
  • మందేసి చిల్ అవుతున్న ఇరుపార్టీల కార్యకర్తలు
  • చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోతున్న పసుపు క్యాడర్

07:24 PM, Apr 17th, 2024
కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట:  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్‌రెడ్డి

  • చంద్రబాబు నీచమైన ఆలోచనలు చేసే వ్యక్తి
  • కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట
  • షర్మిల, సునీతను చంద్రబాబు ట్రాప్‌ చేశాడు
  • చంద్రబాబు స్క్రిప్ట్‌నే వాళ్లు చదువుతున్నారు
  • అవినాష్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
  • సిట్‌ దర్యాప్తును సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు
  • తనకు నచ్చిన వాళ్ల దగ్గరే సీబీఐ వాంగ్మూలం తీసుకుంది
  • రాజశేఖర్‌ అనే వ్యక్తిని హత్య జరిగే ముందురోజే కాణిపాకం పంపారు
  • చెవ్వులు వినపడని రంగన్నను ఇంటి వద్ద ఉంటారు
  • వివేకా హత్య డ్రామా ప్లే చేసిందే సునీత, రాజశేఖర్‌రెడ్డి
  • షర్మిల కడపలోనే ఎందుకు పోటీ చేస్తోంది?
  • షర్మిలకు డబ్బులు ఇచ్చేందుకే బాబు టికెట్లు అమ్ముకుంటున్నాడు

06:23 PM, Apr 17th, 2024
మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపటి షెడ్యూల్‌

  • మేమంతా సిద్ధం - 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్
  • సీఎం జగన్‌ ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు.
  • తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక  చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
  • కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్  దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

06:19 PM, Apr 17th, 2024
జుగుప్సాకరంగా బాలకృష్ణ వ్యాఖ్యలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్‌

  • బాలకృష్ణ, లోకేష్, ఎల్లో మీడియా కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు చేశాం
  • బాలకృష్ణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి
  • సీఎం ఇమేజ్‌ని డామేజ్ చేసేలా బాలకృష్ణ మాట్లాడారు
  • సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు
  • ఈసీకి ఫిర్యాదు చేసినా టీడీపీ నేతల తీరు మారలేదు
  • బుద్ది లేకుండా అసభ్యకర పదజాలం వాడుతున్నారు
  • హిందుపురం మొహం చూడని బాలకృష్ణ స్వర్ణాంధ్ర యాత్ర చేయటం సిగ్గుచేటు
  • సీఎస్పై తప్పుడు కథనాలు రాయటం సరికాదు
  • ఎన్నారైలు పేదల ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు
  • ఎన్నారైల తీరును ఖండిస్తున్నాము
  • ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలి
  • రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదు

06:11 PM, Apr 17th, 2024
ప్రశాంత్ కిశోర్ పై బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కీలక వ్యాఖ్యలు

  • చంద్రబాబు కోసం ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు
  • దీనిపై నాకు స్పష్టమైన సమాచారం ఉంది
  • బాబు, బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు
  • ప్రస్తుతం నా కోసం ప్రశాంత్ కిశోర్ పని చేయడం లేదు
  • ప్రశాంత్ కిశోర్ కు ఏవో సమస్యలున్నాయి
  • ఇటీవలే చంద్రబాబును కలిసిన ప్రశాంత్ కిశోర్
  • బాబును కలిశాక కూటమి గెలుస్తుందంటూ ప్రశాంత్ కిశోర్ ప్రచారం
  • మమతా వ్యాఖ్యలతో స్పష్టమైన చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ బంధం

05:18 PM, Apr 17th, 2024
సీఎం హత్యాయత్నం కేసు విచారణ..  చంద్రబాబుకు ఎందుకీ ఉలిక్కిపాటు?

  • చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రా రెడ్డి మండిపాటు
  • బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు
  • అసలు బోండా ఉమా ఈ కేసులో ఉన్నాడని మికేలా తెలుసు?
  • అంటే సీఎం జగన్ పై దాడి చేయించింది మిరే అని అంగీకరిస్తున్నారా..?
  • చంద్రబాబుకి ఈ కేసులో విచారణ తన వరకు వస్తుందని భయపడుతున్నాడా?
  • సీఎం జగన్‌కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు చంద్రబాబు దిగజారుతున్నాడు
  • టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జనాదరణ లేక ఇలా తెగిస్తున్నారు
  • మూడు పార్టీలకు ఎల్లో మీడియా తోడై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • రామోజీరావు మార్గదర్శి స్కాం సొమ్ము కాపాడుకునేందుకు చంద్రబాబుకి కొమ్ము కాస్తున్నాడు
  • సీఎం జగన్‌కి బస్సు యాత్రలో జనం బ్రహ్మరథం పడితే చూసి ఓర్వలేకపోతున్నారు
  • చంద్రబాబు 14 ఏళ్లు ఏం చేశాడో చెప్పుకోలేకపోవడం సిగ్గుచేటు
  • ఎన్నికలకు ముందే టీడీపీ దివాలా తీసేసింది
  • సీఎం జగన్‌పై దాడి కేసులో అసలు దొంగ చంద్రబాబు అని అర్థమవుతోంది
  • బోండా ఉమని విచారించకుండానే చంద్రబాబు మాట్లాడుతున్నాడు
  • దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నాడు

05:02 PM, Apr 17th, 2024
ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు
  • 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది
  • 2017లో సుప్రీం కోర్టులో కేసు వేశాను
  • గత ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో కేసు వాయిదా కోరారు
  • రేపు కేసు విచారణ జరగబోతుంది
  • అన్ని సాక్షాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది
  • ఏడేళ్లయినా విచారణ  జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా?
  • ఓటు కు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు
  • తెలంగాణ ఏసిబి ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు
  • అందుకే సీబిఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి 
  • ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి
  • ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి
  • మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు
  • అలాగే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు
  • ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది
  • ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు లజ్జా లేకుండా బుకయిస్తున్నారు
  • ఏడేళ్లయినా చిన్న కారణాలతో సాగదీస్తున్నారు
  • రెడ్ హ్యాండెడ్‌గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారు
  • నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు
  • నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు
  • అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అయితోంది
  • ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు
  • ఇకనైనా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సంకేతాలు ఉండాలి
  • ఓటుకి నోటుకు సంబంధించి ఐదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి.
  • అయిదు కోట్లకి బేరం కుదుర్చుకుని, యాభై లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారు
  • కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది
  • ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు
  • రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు

03:57 PM, Apr 17th, 2024
రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం

  • రేపు ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
  • రేపు నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ
  • ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు
  • రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, 25 నామినేషన్లకు చివరి తేదీ
  • 26న నామినేషన్ల పరిశీలన, 29న విత్‌డ్రాకు గడువు, మే 13న పోలింగ్

02:52 PM, Apr 17th, 2024
అమరావతి : జనసేన అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన పవన్‌

  • తొలి బీఫాంను నాదెండ్ల మనోహర్ కు అందజేసిన పవన్
  • ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన పవన్
  • పాలకొండ అభ్యర్థి జయకృష్ణ గైర్హాజరు
  • ఈ ఎన్నికలు అత్యంత కీలకమన్న పవన్‌
  • క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరు పర్యటనలు, ప్రచారం చేయాలని విజ్ఞప్తులు
  • బీజేపీ, టీడీపీ నేతలు కలిసి రావడం లేదన్న అభ్యర్థులు
  • ఎలాగైనా కలుపుకుని ముందుకెళ్లాలని సూచన

02:47 PM, Apr 17th, 2024
కుప్పంలో ఈనెల 19న చంద్రబాబు నామినేషన్‌

  • చంద్రబాబు తరపున నామినేషన్ వేయనున్న భువనేశ్వరి
  • 19న మ.12.33 గంటలకు చంద్రబాబు తరపున నామినేషన్

02:45 PM, Apr 17th, 2024
బాలకృష్ణ పై మండిపడ్డ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

  • నా పై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి
  • నేను మద్యం, ఇసుక వ్యాపారం చేస్తున్నట్టు దమ్ముంటే బాలకృష్ణ నిరూపించాలి
  • బాలకృష్ణ ఇసుకవ్యాపారం చేస్తున్నారని నేనూ ఆరోపిస్తా
  • ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి గెలుస్తా: బాలనాగిరెడ్డి

02:40 PM, Apr 17th, 2024
మళ్లీ జగనే ఏపీ నెక్ట్స్ సీఎం : హీరో విశాల్

  • ప్రజల కోసం పనిచేసే వ్యక్తి జగన్
  • వేల కిలో మీటర్ల పాదయాత్రతో ప్రజల కష్టాలను దగ్గరగా చూశారు
  • విద్య విషయంలో ఏపీ సూపర్
  • విద్యార్థులకు మంచి ప్లాట్‌ఫామ్ ఇస్తున్నారు: హీరో విశాల్

02:36 PM, Apr 17th, 2024
రాజమండ్రిలో ఎల్లుండి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి నామినేషన్

  • ఎల్లుండి మధ్యాహ్నం 1:30 గంటలకు నామినేషన్ వేయనున్న పురంధేశ్వరి

02:35 PM, Apr 17th, 2024
సీఎం జగన్ పై దాడి ఘటనలో బోండా ఉమ పాత్ర ఉండొచ్చు  కేశినేని నాని

  • విజయవాడ : బోండా ఉమ ఒక రౌడీ షీటర్
  • విజయవాడలో బోండా ఉమ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు
  • బోండా ఉమ కాళకేయుడు, కీచకుడు: కేశినేని నాని

02:32 PM, Apr 17th, 2024
రేపు మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్

  • అమరావతి: కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నారా లోకేష్
  • రేపు ఉదయం 9 గంటలకు శ్రీసీతారాముల ఆలయం నుంచి ర్యాలీ
  • భారీగా జనసమీకరణ చేయాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి
  • మంగళగిరి కాకపోతే చుట్టు పక్కల నుంచి తీసుకురావాలని పార్టీ అధిష్టానం సూచనలు

02:30 PM, Apr 17th, 2024
ఢిల్లీ: రేపు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ 

  • ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబిఐకి అప్పగించాలని పిటిషన్ 
  • పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
  • గత విచారణలో వాయిదా కోరిన చంద్రబాబు న్యాయవాది సిద్దార్థ లుత్రా
  • విచారణ జరపనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం
  • 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బాబు
  • ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తెలంగాణ ఏసీబీ
  • ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన  చంద్రబాబు
  • ఫోన్‌లో మాట్లాడిన ఆడియో  బయటపెట్టిన ఏసీబీ
  • "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్

01:00 PM, Apr 17th, 2024
అనపర్తి సీటుకు టీడీపీ ఎసరు ?

  • బీజేపీ కోటలో ఉన్న సీటును మార్చేందుకు టీడీపీ ప్రయత్నాలు 
  • మాజీ సైనిక ఉద్యోగికి ఇచ్చిన సీటును మార్చవద్దని అధిష్టానానికి ఫిర్యాదులు 
  • అనపర్తి సీటును మార్చే ప్రయత్నాలను ఆపాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసిన మాజీ సైనిక ఉద్యోగ సంఘాలు 
  • ఎక్స్ సర్వీస్ మెన్ ఎమ్మెస్ఆర్కే.రాజు కు ఇచ్చిన సీటును మారిస్తే దేశవ్యాప్తంగా  మాజీ సైనిక ఉద్యోగులను అవమానించినట్లు అవుతుందని ఫిర్యాదులు

12:00 PM, Apr 17th, 2024
రాయచోటి లో టీడీపీకి భారీ షాక్.

  • మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లాతో సహ పలు కీలక నాయకులు మైనారిటీ నాయకుడు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిక.
  • కొత్తగా వైఎస్సార్‌సీపీలోలో చేరిన నాయకులకు ఖండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డిలు.
  • సీఎం జగన్ పాలన నచ్చింది, ఎంతగానో ఆకట్టుకుంది, జగన్ వెంట నడవాలని పార్టీ లో చేరామంటున్న నూతన నేతలు.

11:00 AM, Apr 17th, 2024
రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత చంద్రబాబుది: పెద్దిరెడ్డి

  • పుంగనూరు నియోజకవర్గం లో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం.
  • పులిచర్ల మండలంలో నేడు 12 పంచాయతీల్లో మంత్రి పర్యటన.
  • రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంత్రి.
  • పుంగనూరు నియోజకవర్గం లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం: పెద్దిరెడ్డి
  • ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది.
  • గండికోట నుండి నీరు ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ మనకు ఇక్కడ మూడు ప్రాజెక్టులు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
  • చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారు.
  • త్వరలో ఆ పనులు పూర్తి చేసి, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం
  • గతంలో ఎన్నడూ లేని విధంగా పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చేయగలిగాం.
  • మన నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించే విధంగా మనమంతా కృషి చేయాలి.
  • సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు.
  • చంద్రబాబు 2014లో 100 పేజీల మేనిఫెస్టో, 600 హామీలు ఇచ్చారు.
  • అందులో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదు.
  • ఐదేళ్లు తాత్కాలిక రాజధాని నిర్మాణం అని సొంత అజెండాతో చంద్రబాబు పనిచేశారు.
  • కరోనాతో రెండేళ్లు పోయినా హామీలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌ది.
  • నేడు సూపర్ సిక్స్, మీ భవిష్యత్తు కు నా గ్యారంటీ అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యాడు.
  • సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుందన్న చంద్రబాబు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
  • ఎన్నికలు కోసం చంద్రబాబు అమలు చేయడం వీలుకాని హామీలు అన్ని ఇస్తున్నారు.
  • కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
  • చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు, లబ్ది అందించేవారు.
  • సిఎం వైఎస్ జగన్ ఆలోచన వలన ప్రతి ఇంటికి నేడు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
  • పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నారు.
  • ఆరోగ్య శ్రీ ద్వారా 25 లక్షల వరకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
  • ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డి ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.
  • వైఎస్ జగన్ లాంటి గొప్ప ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు.
  • మన కోసం శ్రమించే వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి

10:20 AM, Apr 17th, 2024
దేవినేని నెహ్రు పేదల కోసం పనిచేశారు: దేవినేని అవినాష్

  • దశాబ్దాలుగా దేవినేని నెహ్రూతో సన్నిహితంగా ఉండే నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది
  • నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసం పని చేశారు
  • ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్సార్‌తో కలిసి ప్రజాసేవ చేశారు
  • నెహ్రూ చేసిన మంచిపనులు చిరస్థాయిగా నిలిచిపోయాయి
  • కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రును ఎప్పటికీ మరిచిపోయారు
  • నెహ్రూ ఆశయ సాధన కోసం, రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పనిచేస్తాం
  • చనిపోయి ఏడేళ్లయినా నెహ్రూ మీద అభిమానం అందరికి అలాగే ఉంది
  • నెహ్రూ అభిమానులకు నెహ్రూ కుటుంబంగా ఎల్లప్పుడు అండగా ఉంటాం

09:40 AM, Apr 17th, 2024
రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ..

  • రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం
  • రేపు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు  నామినేషన్ల ప్రక్రియ షురూ
  • రేపు ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
  • ఏపీ , తెలంగాణ సహ పది రాష్ట్రాలలో  96 ఎంపీ సీట్లకు నాలుగో విడత లో ఎన్నికలు
  • ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ 
  • ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 
  • ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన 
  • ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం 
  • మే 13న పోలింగ్

08:30 AM, Apr 17th, 2024
కూటమిలో ఇంకా కొలిక్కిరాని సీట్ల పంచాయితీ..

  • కూటమి సీట్లపై ఇప్పటికీ అయోమయంలో చంద్రబాబు 
  • రఘురామకృష్ణరాజు కోసం రకరకాల విన్యాసాలు 
  • నర్సాపురం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఇవ్వాలని ప్రయత్నాలు 
  • నర్సాపురం నుంచి బీజేపీని తప్పించడానికి ప్రత్యామ్నాయాలు 
  • ఏలూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం 
  • దెందులూరు, అనపర్తి, మాడుగల స్థానాలపైనా లీకులు 
  • మరికొన్ని స్థానాల్లోనూ మార్పు తథ్యమని హడావుడి 
  • నామినేషన్ల పర్వం మొదలవుతున్నా ఇంకా రాని స్పష్టత

07:20 AM, Apr 17th, 2024
రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్‌: సీఎం జగన్‌

  • చంద్రబాబుకు పది మంది సేనానులు.. మీ గురి ఎవరిపై?.. భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌  
  • ప్రజలకు అందుతున్న పథకాలు, వ్యవస్థలపై బాణాలా?  
  • నేను ఒక్కడినే కానీ ఒంటరిని కాదు.. నాకు తోడుగా పేదల సైన్యం  
  • రాష్ట్రమంతటా కోట్ల హృదయాలు జగన్‌ను కోరుకుంటున్నాయి 
  • రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్‌ 
  • బాబుకు – అభివృద్ధికి ఏం సంబంధం? అంతా సెల్ఫ్‌ డబ్బా..  
  • సింగపూర్‌ కట్టాడా? మైక్రోసాఫ్ట్‌ తెచ్చాడా? బుల్లెట్‌ ట్రైను తెచ్చాడా?  
  • కొత్త పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు తెచ్చాడా? జిల్లాకో హైటెక్‌ సిటీ కనిపించిందా?  
  • బాబు రిపోర్ట్‌ అంతా బోగస్‌.. మన ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ మీరే చూడండి 
  • కొంగ జపం ఎందుకని నిలదీస్తే నాపై శాపనార్థాలు.. కోపంతో ఊగిపోతున్నారు 
  • దత్తపుత్రుడు కార్లు, భార్యల మాదిరిగా నియోజకవర్గాలనూ మారుస్తున్నాడు 
  • నిన్ను మిగతా వాళ్లూ అనుసరిస్తే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి? 

07:00 AM, Apr 17th, 2024
ఏపీలో ఫ్యాను గాలి ప్రచండం..

  • ఏ ఊళ్లో ఏ నోట విన్నా ఈ మాటే 
  • జాతీయ మీడియా, పొలిటికల్‌ కన్సల్టెన్సీ సర్వేలదీ అదే మాట 
  • రాజకీయ విశ్లేషకులు, సీనియర్‌ పాత్రికేయులదీ ఆ మాటే 
  • ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ 
  • బస్సు యాత్రలో జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు పలుకుతుండటమే తార్కాణం 
  • జనసేన, బీజేపీతో జత కలిసిన టీడీపీకి మరోసారి ఘోర పరాభవం ఖాయం 
  • సీఎం జగన్‌పై నమ్మకమే వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయానికి బాట 
  • చంద్రబాబు మోసకారి కావడం వల్లే ఘోర ఓటమి బాటలో కూటమి  

06:50 AM, Apr 17th, 2024
ఓ భూం.. భూమి స్వాహా!

  • భూ‘దండు’ పాళ్యం బ్యాచ్‌–3
  • కర్త, కర్మ, క్రియ చంద్రబాబే..  
  • అమరావతి భూ దోపిడీలో చినబాబూ సూత్రధారే
  • తెరవెనుక పాత్రధారులుగా బాబు అండ్‌ కో 
  • బినామీ పేర్లతో పేదల భూములపై పచ్చదండు దాడి 
  • రాజధాని లీక్స్‌తో రూ.2 లక్షల కోట్ల భూ దురాక్రమణ 
  • నారాయణ, లింగమనేని, సుజనా, ప్రత్తిపాటి, ధూళిపాళ్ల దోపిడీ లీలలు.. కొమ్మాలపాటి, కోడెల,పయ్యావుల, మురళీ మోహన్‌ల భూ దందా

06:45 AM, Apr 17th, 2024
అవినీతిలో మేటి పత్తిపాటి..

  • సీసీఐలో పత్తి కొనుగోలు పేరిట రూ.650 కోట్లు హాంఫట్‌
  • మాజీ మంత్రి ప్రత్తిపాటి అక్రమాల చిట్టా
  • యడవల్లిలో దళితుల భూముల కాజేతకు కుట్ర 
  • రేషన్‌ బియ్యం మాఫియా కింగ్‌గానూ పేరు  
  • తక్కువ ధరకు అగ్రిగోల్డ్‌ భూముల స్వాదీనం 
  • భార్య వెంకాయమ్మ పేరుతో రిజిస్ట్రేషన్

06:40 AM, Apr 17th, 2024
పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది: వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌

  • నగరాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా నాకు కూటమిలో సీటు వస్తుందని అనుకున్నారు
  • డిల్లీ నుండి ఊడిపడిన సుజనా చౌదరి ఎప్పుడూ వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయలేదు
  • అవకాశాలు, కేసులను బట్టి సుజనా పార్టీ మారిపోయాడు
  • బ్యాంకులను కొల్లగొట్టిన సుజనా చౌదరి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబడ్డారు
  • సుజానాకు పశ్చిమ సీటు ఇచ్చారు
  • ఇప్పుడు నేను సామాన్యుడైన అసిఫ్ వైపు నిలబడాలా.. సుజనా వంటి కార్పొరేట్ శక్తి వైపు నిలబడాలా?
  • టీడీపీ, జనసేన బ్రోకర్లు నా ఇంటికి వచ్చినపుడు నేను తిరస్కరించాను
  • నగరాల ఆత్మ గౌరవం కోసం నేను సుజనాను వ్యతిరేకించాను
  • సీఎం జగన్ నగరాలకు మేయర్, దుర్గగుడి చైర్మన్, శ్రీశైలం లో 50సెంట్ల భూమి ఇచ్చారు
  • బీసీలకు గుర్తింపు ఇచ్చారు, నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు 
  • అనేక పదవులు, గౌరవం, గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్ వైపు ఉండాలా.. రాత్రికిరాత్రి సుజనా ను దింపిన కూటమి వైపు ఉండాలా
  • పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది
  • టీడీపీలో ఆ సామాజిక వర్గానికి తప్ప ఎవరికీ అవకాశం ఉండదని తెలిసింది
  • వైఎస్సార్‌సీపీలో చేరిన నాలుగు రోజులకే సీఎం జగన్ నన్ను బస్సు యాత్రలో పలకరించి బస్సులోనికి రమ్మన్నారు
  • అభ్యర్థులతో పాటు నన్ను కూడా బస్సు పైకి ఎక్కించారు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆసిఫ్‌ని గెలిపించాలి 
  • లేని గ్లాసు గుర్తు కోసం జనసేన నాయకులు తాపత్రయ పడుతున్నారు
  • సుజనా లోకల్ కాదు.. నేను లోకల్, ఆసిఫ్ లోకల్
  • సుజనా పేద ప్రజల మనిషి కాదు.. ప్రైవేట్ జెట్‌లలో తిరిగే వ్యక్తి

06:40 AM, Apr 17th, 2024
సీఎం జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం: వంగా గీతా 

  • రాజకీయ నాయకులంటే గౌరవం పోయింది..ప్రభుత్వాలంటే నమ్మకం పోయింది.
  • సంక్షేమ పధకాలు రాజకీయ నాయకులు...అధికారుల చట్రంలో ఉండేవి
  • ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సచివాలయం,వాలంటీర్ వ్యవస్ధను తీసుకువచ్చింది ఒక్క సిఎం జగనే
  • కుల మతాలు..పార్టీలు చూడకుండా శాచురేషన్ పద్దతిలో అర్హులకు సంక్షేమ పధకాలు అందించారు.
  • మళ్ళీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిదే
  • పిఠాపురంలో కూడా గెలుపు వైఎస్సార్‌సీపీదే

Advertisement
Advertisement