‘శివసేన, ఎన్సీపీ పార్టీల చీలికకు కారణం వారిపై ప్రేమ’ | Sakshi
Sakshi News home page

‘శివసేన, ఎన్సీపీ పార్టీల చీలికకు కారణం వారిపై ప్రేమ’

Published Sun, Apr 14 2024 9:03 PM

Shah says Uddhav Sharad Pawar splitting caused Love for son and daughter - Sakshi

ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ శివసేన(ఉద్ధవ్‌), ఎ‍న్సీపీ(శరద్‌ పవార్‌) పార్టీల చీలికపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు తమ సొంత పార్టీల నుంచి చీలిపోవడానికి కోడుకు, కూతురి మీద చూపించిన ప్రేమే కారణమని అన్నా‍రు.

ఆదివారం భండారా జిల్లాలోని సకోలి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా పాల్గొని మాట్లాడారు. మహా వికాస్‌ ఆఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్‌), ఎన్సీపీ(శరద్‌ పవార్‌), కాంగ్రెస్‌ పార్టీల మధ్య సీట్ల పంపకంలో విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ పార్టీలను విభజిస్తుందన్న ఆరోపణలపై అమిత్‌ షా తీవ్రంగా మండిపడ్డారు. ‘శివసేన, ఎన్సీపీల్లో  చీలికలు  రావడానికి కారణం ఉద్ధవ్‌కు కొడుకు మీద, శరద్‌ పవార్‌కు కూతురు మీద ప్రేమే కారణం. కూటమిలోని మూడు పార్టీ మహారాష్ట్రకుఘ ఏం మంచి చేశారు’ అని  అమిత్ షా ధ్వజమెత్తారు.

మరోవైపు.. ఇటీవల ప్రధాని నరేంద్ర ఎన్నికల ప్రచారం పాల్గొని శివసేన(ఉద్ధవ్‌) పార్టీపై నకిలీ శివసేన అంటూ విమర్శలు గుప్పించారు. ఇటీవల అమిత్‌ షా.. మహా వికాస్‌ ఆఘాడీను సరిపోలని విడి భాగాలతో కూడిన ఆటో రిక్షాతో పోల్చుతూ విమర్శలు చేశారు. ఇక..  మహా వికాస్‌ ఆఘాడీ కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ సాంగ్లీ, భీవండి, ముంబై సౌత్‌ సెంట్రల్‌ స్థానాలను కాంగ్రెస్‌ వదులుకున్న విషయం తెలిసిందే. సీట్ల పంపకంలో భాగంగా శివసేన(ఉద్ధవ్‌) 21 స్థానాలు,ఎన్సీపీ 10 స్థానాలు, కాంగ్రెస్‌ పది స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement