సీయూల రెండో విడత ర్యాండమైజేషన్‌ | Sakshi
Sakshi News home page

సీయూల రెండో విడత ర్యాండమైజేషన్‌

Published Tue, May 7 2024 10:55 AM

సీయూల రెండో విడత ర్యాండమైజేషన్‌

సుభాష్‌నగర్‌: పార్లమెంట్‌ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా అదనపు కంట్రోల్‌ యూనిట్ల రెండో విడత ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సోమవారం సాధార ణ పరిశీలకులు ఎలిస్‌ వజ్‌ ఆర్‌ సమక్షంలో ప్రక్రియ పూర్తి చేశారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి తరపున ప్రతినిధులు హాజరయ్యారు. పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని ఆర్మూర్‌, బోధన్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా 15 చొప్పున కంట్రోల్‌ యూనిట్లు, బా ల్కొండకు 40, నిజామాబాద్‌ అర్బన్‌కు 35, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి 20 సీయూలు అదనంగా అందుబాటులో ఉంచామని కలెక్టర్‌ వివరించారు. అదనపు సీయూలు సెక్టోరల్‌ అధికారుల వద్ద రిజర్వ్‌లో ఉంచామని, పోలింగ్‌ సమయంలో ఎక్కడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే తమ వద్ద రిజర్వ్‌లో ఉండే సీయూలను సమకూరుస్తారని కలెక్టర్‌ తెలిపారు. కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కమిషనింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత సాంకేతిక సమస్యలు ఏర్పడిన సీయూల సంఖ్య ఆధారంగా అదనపు యూనిట్లు కేటాయిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌, సాత్విక్‌, సంతోష్‌, జితేందర్‌ పాల్గొన్నారు.

సదుపాయాలపై దృష్టి సారించాలి

ఈనెల 13న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉండేలా ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూ చించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై కలెక్టర్‌ సోమవారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ ను అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలని, ఏ వైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిచేయాలన్నా రు. ముఖ్యంగా వేసవి తీవ్రత దృష్ట్యా ఓటర్లకు, బీఎల్‌వోలు, వాలంటీర్లు, ఆశ వర్కర్లకు ఇబ్బందులు కలుగుకుండా చూడాలన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీల కార్యదర్శులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్‌ కేంద్రాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేయాలని, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ మంగళవారం నాటితో వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. మోడల్‌ పోలింగ్‌ కేంద్రాల ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. కాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement