ఇందూరు గడ్డ.. గులాబీ అడ్డా | Sakshi
Sakshi News home page

ఇందూరు గడ్డ.. గులాబీ అడ్డా

Published Tue, May 7 2024 10:55 AM

ఇందూర

నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్‌ గడ్డ.. గులాబీ పార్టీ అడ్డా అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తాను పార్టీ పెట్టగానే ఈ జిల్లా ఊపిరి పోసిందని, ఇక్కడి ప్రజలు బీఆర్‌ఎస్‌కు తొలి జెడ్పీ చైర్మన్‌ స్థానం ఇచ్చారని గుర్తు చేశారు. మొదటి సారి గులాబీ జెండా ఎగిరింది నిజామాబాద్‌ జిల్లాలోనేనన్నారు. నా గుండెలో ఈ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నెహ్రుపార్క్‌ చౌరస్తాలో సోమ వారం రాత్రి ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ కార్నర్‌ మీటింగ్‌లో కేసీఆర్‌ ప్రసంగించారు. రాష్ట్రంలోనే నిజామాబాద్‌ ఒకప్పుడు బంగారు జిల్లా అన్నారు. పదేళ్లలో ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో గుత్ప, అలీసాగర్‌లను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నిజాంసాగర్‌లో నీళ్లు నింపి, వరద కాల్వలు అభివృద్ధి చేశామన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథ కాన్ని నిర్మించామని ఆయన తెలిపారు. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికి నీరు ఇచ్చామన్నారు. ఇలా ఈ ప్రాంతాన్ని సస్యశ్యా మలం చేశామని కేసీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో కరెంట్‌ కోతలు అనేవే లేవన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే కరెంటు కోతలు మొదలయ్యాయని వివరించారు. కల్యాణలక్ష్మిలో భాగంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి తుస్సు మనిపించారన్నారు. ధాన్యం కొనే పరిస్థితి లేదని.. పంటకు బోనస్‌ ఇవ్వలేదని.. గిట్టు బాటు ధర ఇవ్వ డం లేదని.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంలేదని మండిపడ్డారు.

నిరుపేద విద్యార్థుల కోసం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకంలో భాగంగా విదేశీ విద్య కోసం రూ. 20లక్షలు సహాయం చేస్తే.. కాంగ్రెస్‌ పార్టీ నిలిపివేసిందని ఆరోపించారు. కేసీఆర్‌ కిట్‌ బంద్‌ చేశారని, సీఎంఆర్‌ఎఫ్‌ ఇవ్వడం లేదని విమర్శించారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడంలేదని.. పనులు లేక ఆత్మహత్యలు మొదలయ్యాయని, రాష్ట్రంలో పరిశ్రమలు కూడా తరలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు గెలిస్తే.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ లను మెడలు వంచి అమలు చేయిస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలి పారు. పోరాటాలు చేస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలా లు అందుతాయని పేర్కొన్నారు.

బైపాస్‌ చౌరస్తాలో కేసీఆర్‌కు స్వాగతం

కేసీఆర్‌ బస్సుయాత్ర సోమవారం జిల్లాలోని కమ్మర్‌పల్లిలో అడుగుపెట్టింది. మోర్తాడ్‌, పెర్కిట్‌ చౌర స్తా మీదుగా నిజామాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కంఠేశ్వర్‌ బైపాస్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. బస్సుయాత్ర కంఠేశ్వర్‌, ఎన్టీఆర్‌ చౌరస్తా, బస్టాండ్‌, గాంధీచౌక్‌ మీదుగా నెహ్రు పార్కు చౌరస్తా వరకు సాగింది.

ఐదు నెలలు గడిచినా

రుణమాఫీ చేయలే..

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఐదునెలలు గడుస్తుందని.. అయినా ఇప్పటికీ రుణమాఫీ చేయలేదని కేసీఆర్‌ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రైతు బంధు డబ్బులు రైతులకు వెయ్యలేదని.. తాను యాత్ర ప్రారంభించగానే రేవంత్‌రెడ్డి భయంతో రైతు బంధు డబ్బులు వేస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు కూడా ఐదెకరాల్లోపు రైతులకే పరిమితం చేయబోతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై గళమెత్తి పోరాడేది కేవలం బీఆర్‌ఎస్‌ పార్టీయేనని స్పష్టం చేశారు. అందుకే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎంపీ కేఆర్‌ సురేష్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, జెడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, మేయర్‌ దండు నీతూకిరణ్‌, నాయకులు ఎస్‌ఏ అలీం, బీఆర్‌ఎస్‌ బోధన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఫాతిమా, నాయకులు పాల్గొన్నారు.

హైలైట్స్‌..

● రాత్రి 8.33 నిమిషాలకు కేసీఆర్‌ బస్సు యాత్ర నెహ్రూపార్క్‌ చౌరస్తాకు చేరుకుంది.

● 8.41 నిమిషాలకు కేసీఆర్‌ బస్సుపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేసి ప్రసంగం ప్రారంభించారు.

● 9.05 నిమిషాలకు ముగియగా.. 24 నిమిషాల పాటు ప్రసంగం సాగింది.

● అనంతరం బస్సులో బయలుదేరి మాజీ ఎమ్మెల్యే బిగాల నివాసానికి చేరుకున్నారు.

బీడీ కార్మికులకు పింఛన్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే..

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు ప్రభుత్వాలు జీవనభృతి ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్‌ అధినేత పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ప్రతి నెల బీడీ కార్మికులకు రూ. 2వేల జీవన భృత్తి ఇచ్చామని వివరించారు. తా ము బీడీ కార్మికులను ఆదుకున్నామని, నిజాయితీతో ఓటు వేయాలన్నారు. నరేంద్రమోదీ బీడీ కార్మికులను పట్టించుకోలేదన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడేది మేమే..

బీఆర్‌ఎస్‌కు ఊపిరులూదింది

నిజామాబాద్‌ జిల్లానే..

నా గుండెల్లో ప్రత్యేకం స్థానం ఉంది

పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కోతలే..

కార్నర్‌ మీటింగ్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌

ఇందూరు గడ్డ.. గులాబీ అడ్డా
1/3

ఇందూరు గడ్డ.. గులాబీ అడ్డా

ఇందూరు గడ్డ.. గులాబీ అడ్డా
2/3

ఇందూరు గడ్డ.. గులాబీ అడ్డా

ఇందూరు గడ్డ.. గులాబీ అడ్డా
3/3

ఇందూరు గడ్డ.. గులాబీ అడ్డా

Advertisement

తప్పక చదవండి

Advertisement