Sakshi News home page

‘తృణమూల్‌’ మేనిఫెస్టో విడుదల.. కీలక హామీలివే..

Published Wed, Apr 17 2024 4:50 PM

Tmc Releases Manifesto With 10 Points - Sakshi

కలకత్తా: లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్‌ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో టీఎంసీ పశ్చిమబెంగాల్‌ ప్రజలకు 10 హామీలిచ్చింది. బీజేపీ ప్రధాన హామీలైన సీఏఏ, యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌లతో పాటు ఎన్‌ఆర్‌సీలను బెంగాల్‌లో అమలు చేయబోమని మేనిఫెస్టోలో తెలిపింది.

పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 10 వంట గ్యాస్‌ సిలిండర్లు, పేద కుటుంబాలకు ఉచిత ఇల్లు, రేషన్‌కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్‌, పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్‌ ఏర్పాటు లాంటి హామీలు టీఎంసీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సమయంలో టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ అస్సాంలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను రద్దు చేస్తాం. మళ్లీ నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు. ఇంత ప్రమాదకర ఎన్నికలను నేనుఎప్పుడూ చూడలేదు. బీజేపీ దేశం మొత్తాన్ని డిటెన్షన్‌ క్యాంపుగా మార్చేసింది’అన్నారు. కాగా, బెంగాల్‌లో ఏప్రిల్‌ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 

ఇదీ చదవండి.. బీజేపీ 150 సీట్లకే పరిమితం.. రాహుల్‌

Advertisement
Advertisement