జీ–సోనీ విలీన డీల్‌ రద్దు!! | Sony Group Terminates $10 Billion Merger With India's Zee Entertainment For Legal Row - Sakshi
Sakshi News home page

Sony-Zee Entertainment Merger: జీ–సోనీ విలీన డీల్‌ రద్దు!!

Published Tue, Jan 23 2024 5:23 AM

Sony Group terminates merger with Zee Entertainment - Sakshi

న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ గ్రూప్‌ భారత విభాగ విలీన డీల్‌ ఊహాగానాలకు అనుగుణంగానే  రద్దయింది. సోనీ గ్రూప్‌ కార్పొరేషన్‌ సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీల్‌)కు నోటీసు పంపింది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు, ఆర్బిట్రేషన్‌కు తెర తీసినందుకు గాను 90 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.750 కోట్లు) బ్రేకప్‌ ఫీజు చెల్లించాలంటూ డిమాండ్‌ చేసింది.

‘సోనీ గ్రూప్‌ కార్పొరేషన్‌లో భాగమైన సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా (ప్రస్తుతం కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) సంస్థ .. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీల్‌) విలీనానికి సంబంధించి 2021 డిసెంబర్‌ 22న ప్రకటించిన ఒప్పందాలను రద్దు చేస్తూ, నోటీసులు ఇచ్చింది’ అని సోనీ గ్రూప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. విలీన సంస్థకు ఎవరు సారథ్యం వహించాలనే విషయంపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు ఈ విషయమై సోనీ నుంచి నోటీసులు వచి్చనట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు జీల్‌ తెలిపింది. ‘విలీన ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు నిబద్ధతతో అన్ని ప్రయత్నాలు చేశాం. మాకు వన్‌టైమ్‌ ప్రాతిపదికన, మళ్లీ మళ్లీ ఖర్చులకు దారి తీసే చర్యలు కూడా తీసుకున్నాం’ అని తెలిపింది. డీల్‌ రద్దు వ్యవహారంపై చట్టపరంగా తీసుకోదగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నిబంధనల పాటింపునకు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు జీల్‌ 2023 సెపె్టంబర్‌ వరకు దాదాపు రూ. 367 కోట్లు వెచి్చంచింది.  

ఇదీ జరిగింది..
ఎస్‌పీఎన్‌ఐలో జీల్‌ను విలీనం చేసేందుకు సంబంధించి 2021 డిసెంబర్‌లో ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని  ప్రకారం 24 నెలల్లోగా విలీనం జరగాలి. అలా జరగకపోవడంతో నెల రోజుల పాటు జనవరి 21 గడువు పొడిగించారు. డీల్‌ సాకారమై ఉంటే దేశీయంగా 10 బిలియన్‌ డాలర్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించేది. విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీల్‌ ప్రమోటర్లయిన గోయెంకా కుటుంబానికి 3.99 శాతం వాటాలు ఉండేవి.

70 పైగా టీవీ చానల్స్, రెండు వీడియో స్ట్రీమి ంగ్‌ సరీ్వసులు, రెండు ఫిలిమ్‌ స్టూడియోలతో భార త్‌లో అతి పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌గా ఉండేది. ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు లభించాయి. అయితే, ఈలో గా జీ ప్రమోటర్లయిన సుభాష్‌ చంద్ర, ఆయన కుమారుడు .. సీఈవో పునీత్‌ గోయెంకాలపై నిధుల మళ్లింపు ఆరోపణలు రావడంతో వారిని లిస్టెడ్‌ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండకూడదంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది.

దీనిపై సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో గోయెంకాకు స్టే లభించింది. కానీ, ప్రాథమికంగా డీల్‌ కింద విలీన సంస్థ సారథ్య బాధ్యతలను గోయెంకాకు అప్పగించాలని భావించినప్పటికీ ఈ పరిణామాలతో ఆ అంశంపై సందిగ్ధత నెలకొంది. గోయెంకాను సీఈవోగా కొనసాగించడాన్ని సోనీ ఇష్టపడటం లేదని, ఆయన వెనక్కి తగ్గటం లేదని వార్తలు వచ్చాయి. దీనిపై నిర్దిష్ట డెడ్‌లైన్‌లోగా ఇరుపక్షాలూ అంగీకారానికి రాకపోవడంతో డీల్‌ రద్దు కానుందంటూ ఊహాగానాలు వచ్చాయి.

ఇప్పుడేంటి..
ఆదాయాలు, లాభాల క్షీణతతో కొన్నాళ్లుగా జీ ఆర్థిక పనితీరు తగ్గుతూ వస్తోంది. సోనీతో డీల్‌ రద్దు అయిన నేపథ్యంలో జీల్‌కి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, వాల్ట్‌ డిస్నీ భారత మీడియా వ్యాపార విలీనమైతే ఏర్పడే భారీ సంస్థతో పోటీపడేందుకు మళ్లీ వ్యూహాలు రచించుకోవాలి. కొన్ని క్రికెట్‌ ఈవెంట్ల ప్రసారం కోసం డిస్నీలో భాగమైన స్టార్‌తో జీల్‌కి ఒప్పందం ఉంది.

దీని కోసం నాలుగేళ్ల వ్యవధిలో 1.32–1.44 బిలియన్‌ డాలర్ల వరకు చెల్లించాలి. సోనీతో డీల్‌ రద్దు అయినందున ఈ ఒప్పందంపైనా ప్రభావం పడొచ్చు. మరోవైపు, ప్రాంతీయ భాషల్లో జీల్‌కి ఉన్న కంటెంట్, టీవీ చానల్స్‌ అందుబాటులో ఉండవు కాబట్టి సోనీ కూడా భారత్‌లో తన కార్యకలాపాల వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సి రావచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.   

Advertisement
 
Advertisement
 
Advertisement