ED Arrests Chhattisgarh IAS Officer Ranu Sahu In Coal Levy Case - Sakshi
Sakshi News home page

బొగ్గు కుంభకోణంలో మహిళా ఐఏఎస్‌ అరెస్ట్‌

Published Sun, Jul 23 2023 5:45 AM

Enforcement Directorate arrests IAS officer Ranu Sahu in alleged coal levy case - Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణంలో మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు శనివారం మహిళా ఐఏఎస్‌ అధికారి రానూ సాహూను అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో డైరెక్టర్‌గా ఉన్న రానూ సాహూకు అదనపు జిల్లా జడ్జి  అజయ్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మూడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించారు.

బొగ్గు కుంభకోణం కేసులో అరెస్టయిన రెండో ఐఏఎస్‌ అధికారి  సాహు. రాయ్‌గఢ్, కోర్బా జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఆమె అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ లాయర్‌ సౌరభ పాండే తెలిపారు. ఆమె రూ.5.52 కోట్ల విలువైన చరాస్తులను పోగేశారని తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను సాహూ లాయర్‌ ఖండించారు. ఆమెను కల్పితమైన కారణాలతోనే అధికారులు అరెస్ట్‌ చేశారన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement