రోల్స్ రాయిస్ కార్లతో వీధులు ఊడిపించిన భారతీయ రాజు! | Sakshi
Sakshi News home page

రోల్స్ రాయిస్ కార్లతో వీధులు ఊడిపించిన భారతీయ రాజు! ఎందుకో తెలుసా

Published Thu, May 16 2024 3:56 PM

Maharaja Alwar Used Rolls Royce To Collect Garbage From The Streets

రోల్స్ రాయిస్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నుంచే కార్లను ఉత్పత్తి చేసిన ప్రముఖ బ్రాండ్‌  ఇది. అందులో ఇరవై శాతం కార్లు భారత్‌కే దిగమతి అయ్యేవట. అంటే ఆనాడే మన భారతీయుల రాజులకు ఆ కార్లంటే ఎంత మోజు ఉండేదో క్లియర్‌గా తెలుస్తోంది. అలాంటి లగ్జరియస్‌ కార్లతో ఓ భారతీయరాజు నగరంలోని వీధులను ఊడిపించేందుకు ఉపయోగించాడట. అంత ఫేమస్‌ కార్లను ఇలా చెత్తను ఊడ్చేందుకు ఉపయోగించాడో వింటే ఆశ్చర్యపోతారు. అంతేగాదే ఏకంగా ఆ కంపెనీ ఏ దిగొచ్చి క్షమాపణలు చెప్పి ఆరు సరికొత్త కార్లను ఇచ్చిందట. ఏంటా కథ చూద్దామా..!

ఆ భారతీయ రాజు పేరు రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ప్రముఖ మహారాజు జైసింగ్. ఆయన వీటిని కొనాలని అనుకుంటే.. ఒకేసారి మూడు రోల్స్ రాయిస్‌లను కొనుగోలు చేసేవారట. ఆ క్రమంలోనే 1920 సంవత్సరంలో అల్వార్ మహారాజు జైసింగ్ లండన్‌లోని మేఫెయిర్ ఏరియా వీధుల్లో తిరుగుతున్నారు. ఒకసారి సాధారణ వస్త్రధారణలోనే రోల్స్ రాయిస్ షోరూమ్‌లోకి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న ఓ బ్రిటీష్ సేల్స్ మాన్ మహారాజా జై సింగ్‌ను చూసి చూడనట్లు వ్యవహారించాడు. దీన్ని అవమానంగా భావించిన మహారాజు వెంటనే తన హోటల్ గదికి వెళ్లిపోయారు.

తరువాత జై సింగ్ తన సేవకులతో షోరూమ్‌కు కాల్ చేయించి.. అల్వార్ నగర రాజువారు కొన్ని కార్లను  కొనుగోలు చేయబోతున్నట్లుగా తెలయజేశారు. దీంతో రాజు రాకను పురస్కరించుకుని షోరూమ్‌లోని సేల్స్ మెన్స్ అందరూ బారులు తీరడంతో పాటు రెడ్ కార్పెట్ పరిచారు. అప్పుడు రాజు షోరూమ్‌ను సందర్శించి.. అక్కడ  ఆరు కార్లు ఉంటే అన్నింటినీ ఒకేసారి కొనుగోలు చేశారు. డెలివరీ ఛార్జీలతో సహా పూర్తి మొత్తాన్ని చెల్లించారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలయ్యింది. ఆయన అక్కడ జరిగిన అవమానాన్ని దృష్టిలో ఉంచుకని, ఆ ఆరు  రోల్స్ రాయిస్ దేశంలో దిగుమతి అవ్వగానే వీధులను ఊడ్చేందుకు ఉపయోగించాలని మున్సిపాలిటీని ఆదేశించారు.

అతి తక్కువ సమయంలోనే ఈ వార్త యావత్ ప్రపంచం అంతా వ్యాపించింది. అప్పటివరకు వరల్డ్ నంబర్ వన్ కార్ల తయారీ సంస్థగా ఉన్న రోల్స్ రాయిస్ గుడ్‌విల్‌, ఆదాయం ఒక్కసారిగా పతనం అయ్యాయి. దీంతో కంగుతిన్న రోల్స్‌ రాయిస్‌ వెంటనే తమ ప్రవర్తనకు క్షమాపణ చెబుతూ మహారాజా జై సింగ్ కు టెలిగ్రామ్ పంపింది. అంతేగాదు ఆయన ఆగ్రహం చల్లారేలా ఆరు సరికొత్త కార్లను ఉచితంగా అందించింది. దీంతో రోల్స్ రాయిస్ కంపెనీ క్షమాపణలు అంగీకరించిన రాజు జైసింగ్ చెత్తను సేకరించడానికి ఆ కార్లను వినియోగించడం మానేయాలని మున్సిపాలిటీకి సూచించారు. ఏదీఏమైన భారతీయ రాజు దెబ్బకు బ్రిటన్‌ రోల్స్‌ రాయిస్‌ కంపెనీ గడగడలాడింది కదూ.

(చదవండి: ఐశ్వర్యారాయ్‌ టోట్‌ బ్యాగ్‌ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!)

 

Advertisement
 
Advertisement
 
Advertisement