జాంబియా ప్రీ వెడ్డింగ్‌ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే! | Sakshi
Sakshi News home page

జాంబియా ప్రీ వెడ్డింగ్‌ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!

Published Tue, May 7 2024 1:35 PM

Zambia wedding bride should prepare Ichilanga Mulilo check video

పెళ్లిళ్లకు సంబంధించి ఒక్కోదేశంలో ఒక్కో ఆచారం, సాంప్రదాయం పాటిస్తారు. వీటిల్లో  కొన్ని మన భారతీయ సాంప్రదాయాలను పోలి ఉంటాయి. మరికొన్ని భిన్నంగా ఉంటాయి.   భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం అత్తవారింట అడుగు పెట్టిన నవవధువు పాయసం చేసి అత్తింటి వారి నోటిని తీపి చేస్తుంది  కదా. కానీ జాంబియాలో పెళ్లికి ముందే వధువు అత్తింటి వారిని మెప్పించాలి.  అలాంటి ఇంట్రస్టింగ్‌ ఆచారాన్ని గురించి తెలుసుకుందాం. 

జాంబియాలోని బెంబా తెగలో ప్రీవెడ్డింగ్‌ వేడుకలో భాగంగా వధువు, వధువు తరపు కుటుంబం  రకరకాల వంటలను తయారు చేస్తుంది వరుడు కుటంబం కోసం. దీన్నే ఇచిలంగా ములి (అగ్నిని చూపడం) అంటారు. పెళ్లికొడుకు గౌరవార్థం జరిగే సాంప్రదాయ ఆహార వేడుక. ఈ వేడుకలో వధువు కుటుంబం వరుడికి విందు భోజనం వడ్డిస్తుంది. ఇక్కడ వధువు తన పాక నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. అలాగే భవిష్యత్తులో వధువు కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వరుడికి బహిరంగ ఆహ్వానంగా కూడా భావిస్తారు.

న్షిమా: మొక్కజొన్న లేదా మొక్కజొన్నతో తయారు చేసి గంజి లాంటి  ఆహారాన్ని తయారు చేసి, చికెన్‌, ఇతర కూరగాయలతో వడ్డిస్తారు. ఈ విందుకోసం సుమారు 40కి పైగా జాంబియన్ వంటకాలు సిద్దం చేస్తారట. ఇది జాంబియన్ సంస్కృతిలో ఆహారం, ఆతిథ్యం ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది.

 

అలాగే పెళ్లికి ముందు  అబ్బాయి, అమ్మాయిని చూడ్డానికి వెళ్లడం,మధ్య వర్తి రాయ‘బేరా’లు కూడా ఉంటాయి. అలాగే సంతానోత్పత్తికి ప్రతీకగా అమ్మాయి తరపు కుటుంబానికి ఒక గిఫ్ట్‌ను  తీసుకొస్తారు. ముఖ్యంగా నిశ్చితార్థం సూచికగా అబ్బాయి, అ‍మ్మాయికి పూసలు, డబ్బులు  కానుకగా ఇస్తాడు. ఆ తరువాత  ముహూర్తాన్ని ఫిక్స్‌  చేసుకుంటారు. 

 

Advertisement
 
Advertisement
 
Advertisement