మహిళాభివృద్ధే బీజేడీ లక్ష్యం | Sakshi
Sakshi News home page

మహిళాభివృద్ధే బీజేడీ లక్ష్యం

Published Sat, Apr 20 2024 1:15 AM

బైక్‌ ర్యాలీలో బీజేడీ కార్యకర్తలు - Sakshi

రాయగడ: రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సాహించి, అభివృద్ధిలో వారిని అగ్రస్థానంలో నిలపడమే బీజేడీ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, రాయగడ జిల్లా ఎన్నికల పరిశీలకుడు అతున్‌ సవ్యసాచి నాయక్‌ అన్నారు. స్థానిక తేజస్వీ హోటల్‌ మైదానంలో కొత్తగా నిర్మించిన బీజేడీ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ముందుగా స్థానిక కొత్త బస్టాండ్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి బిజు పట్నాయక్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన భారీ బైకు ర్యాలీలో పాల్గొన్నారు. బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాయగడ శాసనసభ నుంచి పోటీ చేస్తున్న అనసూయా మాఝి, కొరాపుట్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కౌలస్య హికకలు ర్యాలీలో పాల్గొన్నారు. కొత్త బస్టాండ్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్‌ మార్కెట్‌ మీదుగా ఫ్‌లైవర్‌ బ్రిడ్జి నుంచి తేజస్వీ ైమెదానం వరకు కొనసాగింది. వేల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం

అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో అతున్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలియజేశారు. మహిళల ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి స్వయం సహాయక బృందాలు, మిషన్‌ శక్తి వంటి పథకాలను బీజేడీ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. గడిచిన రెండు దశాబ్ధాలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న బీజేడీ ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. రాయగడ శాసనసభ, కొరాపుట్‌ లోక్‌సభ వంటి స్థానాల్లో మహిళలకు టిక్కెట్టు ఇచ్చి ఎన్నికల బరిలో నిలబెట్టిన నవీన్‌ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చని వివరించారు.

ఆశీర్వదించండి

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రప్రథమంగా రాయగడ శాసనసభ నుంచి, అదేవిధంగా కొరాపుట్‌ లోక్‌సభ నుంచి మహిళలు పోటీ చేస్తున్నారు. దీంతో ప్రజల ఆశీర్వాదంతో తాము ముందుకు వెళ్లి అభివృద్ధికి కృషి చేస్తామని అనసూయా మాఝి, కౌసల్య హికకలు వేదికపై నుంచి అభ్యర్థిచారు. కార్యకర్తల సహకారం ఉంటే తమ విజయం సునాయాసమవుతుందన్నారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు.

బీజేడీలో చేరికలు

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ యువ నాయకుడు, ప్రముఖ న్యాయవాది బాబు రాజ్‌గురు, అతని మద్దతుదారులు బీజేడీ తీర్ధం పుచ్చుకున్నారు. మంత్రి నాయక్‌ వారికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జితు పూజారి, దయానిధి కొంధొపాణి, నందు మండంగి, విశ్వనాథ్‌ పిడిక, కృష్ణ సరక, శాంత గౌరి పూజారి వంటి కాంగ్రెస్‌ యువ నాయకులు బీజేడీలో చేరినవారిలో ఉన్నారు.

మంత్రి సవ్యసాచి నాయక్‌

రాయగడలో భారీ బైక్‌ ర్యాలీ

సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు
1/3

సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు

బీజేడీలో చేరిన కాంగ్రెస్‌ యువనేత 
బాబు రాజ్‌గురు తదితరులు
2/3

బీజేడీలో చేరిన కాంగ్రెస్‌ యువనేత బాబు రాజ్‌గురు తదితరులు

గెలిపించమని అభ్యర్థిస్తున్న అనసూయా, 
కౌసల్యలు
3/3

గెలిపించమని అభ్యర్థిస్తున్న అనసూయా, కౌసల్యలు

Advertisement

తప్పక చదవండి

Advertisement