వ్యయ పరిశీలన పకడ్బందీగా ఉండాలి | Sakshi
Sakshi News home page

వ్యయ పరిశీలన పకడ్బందీగా ఉండాలి

Published Sat, Apr 20 2024 1:40 AM

మాట్లాడుతున్న సాయన్‌దే బర్మ, చిత్రంలో కలెక్టర్‌ వెంకటరావు, ఎస్పీ రాహుల్‌ హెగ్డే  - Sakshi

దురాజ్‌పల్లి (సూర్యాపేట): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వ్యయ పరిశీలన పకడ్బందీగా చేపట్టాలని భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు సాయన్‌దే బర్మ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తుంగతుర్తి, నకిరకల్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వ్యయ పరిశీలకులు, సహాయ వ్యయ పరిశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ వెంకటరావు, ఎస్పీ రాహుల్‌ హెగ్డేలతో కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో అకౌంటింగ్‌ విధానం, సీజర్‌ కేసులు ఎక్కువగా నమోదు చేయాలని సూచించారు. సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం నిఘా ఉంచాలన్నారు. పెయిడ్‌ ఐటమ్స్‌కు రేట్‌ కార్డు ప్రకారం ఖర్చు వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో జమ చేయాలని, అదేవిధంగా ప్రకటనలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ వెంకట్రావు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలోగల ఆరు మండలాల్లోని 31 సమస్యాత్మక ప్రాంతాల్లో 39 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ తుంగతుర్తి పరిధిలో మూడు చెక్‌పోస్ట్‌లు ఉన్నాయని, 22 రూట్లుగా విభజించి నిఘా పెంచామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.25 లక్షలు, రూ.31లక్షల విలువ గల లిక్కర్‌ సీజ్‌ చేసినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్‌ ప్రియాంక, బీఎస్‌ లత, ట్రైనీ ఐపీఎస్‌ రాజేష్‌ మీనా, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, నోడల్‌ ఆఫీసర్‌ సతీష్‌ కుమార్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఫ భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు సాయన్‌దే బర్మ

Advertisement

తప్పక చదవండి

Advertisement