Sakshi News home page

ChatGPT: చాట్‌జీపీటీ సృష్టికర్తనే తొలగించిన ఓపెన్‌ఏఐ.. కారణం ఇదే!

Published Sat, Nov 18 2023 8:09 AM

ChatGPT maker OpenAI said Sam Altman will step down as the companys CEO - Sakshi

అతి తక్కువ కాలంలోనే పెను సంచలనం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ 'చాట్‌జీపీటీ' (ChatGPT) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతటి అడ్వాన్డ్ టెక్నాలజీని రూపొందించిన 'శామ్‌ ఆల్ట్‌మన్‌' (Sam Altman) కంపెనీ గట్టి షాక్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కారణం ఇదే..
ఓపెన్‌ ఏఐ(OpenAI) సంస్థ 'శామ్‌ ఆల్ట్‌మన్‌'ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్‌ ఆర్థిక సహకారం ఉన్న కంపెనీ ఆయనను విశ్వసించకపోవడమే సీఈఓగా తొలగించడానికి ప్రధాన కారణమని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా.. ఆల్ట్‌మన్‌ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్‌ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదని కంపెనీ వెల్లడించింది.

తాత్కాలిక సీఈఓగా..
ప్రస్తుతం శామ్‌ ఆల్ట్‌మన్‌ స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ 'మిరా మురాటీ' సీఈవోగా వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. త్వరలోనే అధికారికంగా సీఈఓ ఎవరనేది సంస్థ ప్రకటించనుంది. ఆల్ట్‌మన్‌ తొలగింపు నిర్ణయం టెక్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం..

కంపెనీ సీఈఓ పదవి పోయిన తరువాత ఆల్ట్‌మన్ స్పందిస్తూ.. 'ఓపెన్‌ఏఐలో పని చేయడం తనకు చాలా ఇష్టమని, ఎంతోమంది ప్రతిభావంతులతో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని' తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.

Advertisement
Advertisement