ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రెండు త్రైమాసికంలో (క్యూ1,క్యూ2) సిబ్బందికి 80 శాతం వేరియబుల్ పే చెల్లించగా.. మూడో త్రైమాసికంలో (క్యూ3) సమయానికి ఆ మొత్తాన్ని పెంచి 85 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది.
ఆర్ధిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికంలో విప్రో సంస్థ ఉద్యోగులకు వేరియబుల్‌పే 80 శాతం, 81 శాతం చెల్లించింది. అదే సంస్థకు చెందిన క్లౌడ్ విభాగం ‘విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్’ నివేదిక ఆధారంగా.. విప్రో క్యూ3లో గడించిన ఆదాయం ప్రాతిపదికన 80వేల మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి వేరియబుల్ పే 100శాతం అందిచగా..డిసెంబర్ క్యూ4లో 89.74శాతం చెల్లించినట్లు తెలుస్తోంది.
ఉద్యోగులకు విప్రో మెయిల్
వేరియబుల్ పే చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశంపై విప్రో సంస్థ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో రెవెన్యూ (40శాతం), గ్రాస్ మార్జిన్ (30శాతం), మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (30శాతం) ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది.
శాలరీ పెంచింది
విప్రోలో కాస్ట్, ఖర్చులను తీసివేయగా వచ్చే ఆదాయం పరంగా ఉద్యోగులకు శాలరీ చెల్లింపులు ఉంటాయి.అయితే ఈ ఆదాయాలు క్యూ2, క్యూ3లో ఆశించిన మేర లేకపోవడంతో విప్రో యాజమాన్యం ఉద్యోగుల జీతాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత మార్కెట్‌లో డిమాండ్, పెరిగిన ఆదాయంతో కొద్ది నెలల తర్వాత విప్రో ఉద్యోగుల వేతనాన్ని ఏడాదికి 6-8 శాతం పెంచింది. ఈ పెరిగిన జీతం డిసెంబర్1,2023 నుంచి అమల్లోకి వచ్చింది.
వేరియబుల్ పే అంటే ఏమిటి?
అభివృద్ధి, సాధించిన విజయాలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగులకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి వేరియబుల్ పేని చెల్లిస్తుంటాయి. వేరియబుల్ పే ‘పెర్ఫార్మెన్స్-లింక్డ్ పే’గా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా కాంట్రిబ్యూషన్, బోనస్ లేదా కమీషన్ రూపంలో చెల్లిస్తాయి సంస్థలు
Comments
Please login to add a commentAdd a comment