Sakshi News home page

Dipa Khosla: ఇన్‌ఫ్లూయెన్సర్‌తో మొదలై.. మల్టీపుల్‌ బ్రాండ్‌ డీల్స్‌ స్థాయికి

Published Tue, Apr 16 2024 9:02 AM

Influencer Entrepreneur And Philanthropist Deepa Khosla's Success Mantra Is Confidence - Sakshi

గ్లోబల్‌ ఇండియన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తోంది దీప ఖోస్లా. వక్తగా ప్రసిద్ధ హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ముచ్చటగా మూడోసారి ఆహ్వానం అందుకొని చరిత్ర సృష్టించింది. ఇన్‌ఫ్లుయెన్సర్, ఎంటర్‌ప్రెన్యూర్, ఫిలాంత్రపిస్ట్‌గా గుర్తింపు పొం​దిన దీప ఖోస్లా గెలుపు మంత్రం... ఆత్మవిశ్వాసం.

లా స్టూడెంట్‌ నుంచి కంటెంట్‌ క్రియేటర్‌గా, ఆ తరువాత ఎంటర్‌ ప్రెన్యూర్‌గా ప్రయాణం ప్రారంభించింది దీప ఖోస్లా. ఇన్‌స్టాగ్రామ్‌ కొత్తగా పరిచయం అవుతున్న కాలం అది. ‘ఇన్‌ఫ్లూయెన్సర్‌ అంటే?’ అని ప్రశ్న దగ్గరి నుంచి మొదలైన ఆమె ప్రయాణం మల్టీపుల్‌ బ్రాండ్‌ డీల్స్‌తో సక్సెస్‌ఫుల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ స్థాయికి చేరింది. ఆమ్‌స్టర్‌ డామ్‌లోని సోషల్‌ మీడియా ఏజెన్సీలో ఇంటర్న్‌షిప్‌ చేసిన ఫన్ట్‌ ఇండియన్‌ డిజిటల్‌ క్రియేటర్‌గా ప్రత్యేకత సాధించింది.

ఆ తరువాత ‘ఇండి వైల్డ్‌’ (స్కిన్‌ కేర్‌ అండ్‌ బ్యూటీ బ్రాండ్‌) రూపంలో ఎంటర్‌ప్రెన్యూర్‌ గా కూడా అద్భుత విజయం సాధించింది. ఆమె ప్రతి విజయంలో తల్లి సంగీత ఖోస్లా ప్రోత్సాహం ఉంది. ఆమె ఇచ్చిన అపారమైన ధైర్యం ఉంది.

‘ఇండి వైల్డ్‌’ హెయిర్‌ ఆయిల్‌ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. తన తల్లి ఫార్ములా ఆధారంగానే ఈ హెయిర్‌ ఆయిల్‌ను తయారు చేశారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించడానికి కావాల్సింది? ఆత్మవిశ్వాసం. మరి ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? అనే ప్రశ్నకు దీప చెప్పే జవాబు ఇది..

‘ధైర్యంగా ప్రశ్నలు అడగడం నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. వ్యాపారరంగంలోకి అడుగు పెట్టినప్పుడు నాకు పెద్దగా ఏమీ తెలియదు. అయితే ‘ఓటమి’ అనే భయం నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగేలా, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునేలా చేసింది’ భర్తతో కలిసి ‘పోస్ట్‌ ఫర్‌ చేంజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉమెన్‌ ఎంపవర్‌మెంట్, జెండర్‌ ఈక్వాలిటీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది దీప.

‘దిల్లీలో పుట్టి పెరిగాను. ఊటీ స్కూల్, యూరప్‌ యూనివర్శిటీలలో చదువుకున్నాను. ప్రతిష్ఠాత్మకమైన హార్వర్డ్‌ యూనివర్శిటీ సమావేశంలో ప్రసంగించడం నా అదృష్టంగా భావిస్తాను. నేను సాధించిన విజయాలే నన్ను అక్కడివరకు తీసుకువెళ్లాయి. విజయం అంటే కొందరికే పరిమితమైనది కాదు. నాలాగే ఎవరైనా విజయం సాధించవచ్చు’ అంటుంది దీప ఖోస్లా.

దీప నిరంతరం స్మరించే మంత్రం... ఆత్మవిశ్వాసం
      మొటిమలతో ఇబ్బంది పడుతూ నలుగురి లో కలవడానికి ఇష్టపడని స్థితి నుంచి బయటకు తీసుకువచ్చి‘స్టార్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌’ను చేసింది ఆ ఆత్మవిశ్వాసమే. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో వాక్‌ చేసిన తొలి ఇండియన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చింది, నలుగురిలో మాట్లాడడానికి భయపడే స్థితి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘బ్రిటిష్‌ హౌజ్‌ ఆఫ్‌ కామన్‌’లో ప్రసంగించే స్థాయికి తీసుకువెళ్లింది ఆ ఆత్మవిశ్వాసమే.

తాజాగా... హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ సమావేశంలో దీప ఖోస్లాపై రూపొం​దించిన స్ఫూర్తిదాయకమైన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. 2022లో ‘డైవర్శిటీ ఇన్‌ ది బ్యూటీ ఇండస్ట్రీ’ అంశంపై మాట్లాడడానికి హార్వర్డ్‌ యూనివర్శిటీ నుంచి దీపకు ఆహ్వానం అందించింది. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ సమావేశంలో ప్రసంగించిన ఫస్ట్‌ ఇండియన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చరిత్ర సృష్టించింది దీప ఖోస్లా.

పర్సనల్‌ ఐకాన్‌..
దీప ఖోస్లాకు తల్లి సంగీత ఖోస్లా పర్సనల్‌ ఐకాన్‌. కొండంత అండ. ‘నా వెనుక మా అమ్మ ఉంది’ అనే ధైర్యం దీపను ముందుకు నడిపించింది. తల్లి సంగీత ఖోస్లా ఫార్ములా ఆధారంగానే తమ బ్యూటీ బ్రాండ్‌కు సంబంధించిన ‘హెయిర్‌ ఆయిల్‌’ను తయారు చేశారు. సహజ పద్ధతుల్లో ఆరోగ్యంగా ఉండడం, అందంగా కనిపించడం అనేది సంగీత ఖోస్లా ఫిలాససీ. అమ్మ బ్యూటీ ఫిలాసఫీని అనుసరిస్తూ సహజమైన పద్ధతులలో అందంగా కనిపించే టెక్నిక్స్‌ను ఫాలో అవుతుంటుంది దీప ఖోస్లా.

ఇవి చదవండి: Payal Dhare: నంబర్‌ 1 మహిళా గేమర్‌

Advertisement
Advertisement