ఫ్యాన్స్‌లో ఫుల్‌ జోష్‌ | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌లో ఫుల్‌ జోష్‌

Published Thu, Apr 18 2024 1:45 PM

ద్వారకాతిరుమల : చిన వెంకన్న క్షేత్రంలో సీతారాముల కల్యాణ వేడుక  - Sakshi

● జగమంతా.. రామమయం

సీతారాముల కల్యాణం.. చూసిన కనులదే భాగ్యం.. అన్నట్టుగా శ్రీరామనవమి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఊరూవాడా సీతారాముల కల్యాణోత్సవాలతో సందడి నెలకొంది. ద్వారకాతిరుమల క్షేత్రంతో పాటు ప్రముఖ ఆలయాల్లో కల్యాణోత్సవాలు నిర్వహించారు. రథోత్సవాలు, అన్నసమారాధనలు జరిగాయి.

– సాక్షి నెట్‌వర్క్‌

ఉండిలో మూడు

చక్రాల సైకిల్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’బస్సుయాత్ర ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జన గోదావరిని తలపించింది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు మండుటెండను లెక్కచేయకుండా ఊళ్లకు ఊళ్లే రోడ్లపైకి వచ్చాయి. పొద్దుపోయినా వేచి ఉండి జన నీరాజనం పట్టాయి. జై జగన్‌ అంటూ నినదించాయి. యువత ప్రదర్శించిన ఫ్లకార్డులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జిల్లాలో బస్సు యాత్ర, భీమవరం బహిరంగ సభ సూపర్‌ సక్సెస్‌ కావడం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఫుల్‌జోష్‌ నింపగా, మరోపక్క కూటమి గుండెల్లో దడ పుట్టిస్తోంది.

నేడు తణుకులో పర్యటన

మేమంతా సిద్ధం బస్సు యాత్ర బుధవారం తణుకు నియోజకవర్గంలో జరుగనుంది. ఉదయం 9 గంటలకు తేతలిలోని నైట్‌ హాల్ట్‌ క్యాంపు వద్ద నుంచి బయలుదేరి తణుకు క్రాస్‌ మీదుగా సీఎం జగన్‌ తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంటారు. నియోజకవర్గంలో యాత్ర విజయవంతానికి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

పెంటపాడు : కె.పెంటపాడు బైరాగి మఠంలో కల్యాణ తంతు
1/4

పెంటపాడు : కె.పెంటపాడు బైరాగి మఠంలో కల్యాణ తంతు

పెనుగొండ : వడలిలో రథం లాగుతున్న చిన్నారులు
2/4

పెనుగొండ : వడలిలో రథం లాగుతున్న చిన్నారులు

3/4

4/4

Advertisement
 
Advertisement
 
Advertisement