T20 World Cup 2024: ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ ‘మూడ్‌ బర్గర్’‌ కావాలా నాయనా? | T20 World Cup 2024: Hellmann's Mood Burgers In Partnership With Social | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ ‘మూడ్‌ బర్గర్’‌ కావాలా నాయనా?

Jun 6 2024 11:02 AM | Updated on Jun 6 2024 4:10 PM

T20 World Cup 2024: Hellmann's Mood Burgers In Partnership With Social

క్రికెట్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌  మీ మూడ్‌కు తగ్గట్టుగా మూడు బర్గర్స్‌

T20 World Cup 2024 : ఐపీఎల్‌ 2024 పోరు అలా ముగిసిందో లేదో  ఐసీసీ మెన్స్‌ టీ 20 వరల్డ్‌కప్‌ క్రికెట్ ఫీవర్ ఫ్యాన్స్‌ను ఆవహించింది. ఈ నేపథ్యంలోనే హిందుస్థాన్ యూనిలీవర్‌కు చెందిన ఫుడ్స్ అండ్ యూనిలీవర్ ఫుడ్స్ సొల్యూషన్ ఇండియా హెల్‌మాన్స్‌ ఇండియా క్రికెట్‌ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.  మ్యాచ్‌లోని మూడ్‌కు తగ్గట్టుగా  పాకశాస్త్ర నిపుణులతో  కొత్త తరహా  ‘'మూడ్ బర్గర్స్'ను లాంచ్‌ చేసింది.

సోషల్  (SOCIALoffline) భాగస్వామ్యంతో  లిమిడెట్‌ ఎడిషన్‌ మెనూని ప్రకటించింది. క్రికెట్‌ అభిమానుల మూడ్‌కు అనుగుణంగా జూన్ నెల అంతా వెజ్ , నాన్ వెజ్ వేరియంట్‌లలో వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. ఇవి దేశవ్యాప్తంగా 53 సోషల్ అవుట్‌లెట్‌లలో  అందుబాటులో ఉంటాయని హెల్‌మాన్స్‌  హెడ్ ప్రియాంక గంగూలీ తెలిపారు. జూన్ వరకు ఏదైనా ‘సోషల్’ అవుట్‌లెట్‌లను సందర్శింవచ్చు.  లేదా ఆన్‌లైన్‌ ద్వారా జూన్ 6 నుంచి 30వ తేదీ దాకా స్విగ్గీ లేదా  జొమాటో ద్వారా డెలివరీచేస్తారు. హెలెమాన్‌ మూడ్‌ బర్గర్స్‌ రిచ్, ఎక్స్‌ట్రా క్రీమీ, మయో-లైసియస్ లాంటి వెరియంట్స్‌లలో లభిస్తాయి.  

కొత్త బర్గర్స్‌ మెనూతో, ఈ క్రికెట్ సీజన్‌లోని ప్రతి మ్యాచ్‌లోని ప్రతీ క్షణాన్ని మరింత గుర్తుండిపోయేలా చేస్తుందని ఇంప్రెసారియో ఎంటర్‌టైన్‌మెంట్ & హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ దివ్య అగర్వాల్ చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement