గుంటూరులో జనసేన కార్యకర్తల దాష్టీకం | janasena workers attick on Hostel | Sakshi
Sakshi News home page

గుంటూరులో జనసేన కార్యకర్తల దాష్టీకం

Published Thu, Jun 6 2024 7:52 AM | Last Updated on Thu, Jun 6 2024 10:01 AM

janasena workers attick on Hostel

గుంటూరు ఈస్ట్‌: గుంటూరు లక్ష్మీపురంలో జనసేన కార్యకర్తల దాష్టీకమిది. ప్రైవేటు హాస్టల్‌ బోర్డుపై కులం పేరు ఉందన్న కారణంతో జనసేన కార్యకర్తలు ఆ హాస్టల్‌ యజమానిని కొట్టి మోకాళ్ల మీద కూర్చొబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేస్తోంది. జనసేన కార్యకర్తల దురాగతాన్ని ప్రజలు ఖండిస్తున్నారు. లక్ష్మీపురం మెయిన్‌ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్‌లోకి మంగళవారం కొందరు జనసేన కార్యకర్తలు కర్రలతో ప్రవేశించారు.

 హాస్టల్‌ యజమానిని బయటకు పిలిచి బోర్డు పైన ఉన్న ఓ సామాజికవర్గం పేరును తొలగించాలని బెదిరించారు. హాస్టల్‌ యజమాని అందుకు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తులైన జనసేన కార్యకర్తలు మూకుమ్మడిగా హాస్టల్‌ యజమానిపై దాడి చేశారు. వదిలిపెట్టాలని హాస్టల్‌ యజమాని ప్రాధేయపడినా వదల్లేదు. పైగా జనసేన కార్యకర్తలు హాస్టల్‌ యజమానిని మోకాళ్ల మీద కూర్చోబెట్టి, వారి కాళ్ళు పట్టించుకున్నారు. అయితే జనసేన కార్యకర్తలకు భయపడిన హాస్టల్‌ యజమాని ఈ ఘటనపై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేశాడు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement