క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి | Sakshi
Sakshi News home page

క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి

Published Fri, May 17 2024 9:55 AM

క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి

యడ్లపాడు: వచ్చే ఏడాది నాటికి క్షయ (టీబీ)వ్యాధి రహిత రాష్ట్రంగా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో బీసీజీ వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె అర్జునరావు పిలుపునిచ్చారు. యడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్‌సీలోని అన్ని వ్యాక్సిన్ల నిల్వలను పరిశీలించారు. అవి సరిపడా ఉన్నాయా లేదా..అనే విషయాలపై ఆరా తీశారు. అక్కడ నుంచి వంకాయలపాడు గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. స్థానిక ప్రజలను కలిసి క్షయ వ్యాధి లక్షణాలు, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీసీజీ వ్యాక్సిన్‌ ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 18–60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు, ఐదేళ్లలో క్షయ వ్యాధికి గురైన వ్యాధిగ్రస్తుల కుటుంబీకులను బాడీమాస్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్న, పొగత్రాగడం అలవాటు కల, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాక్సిన్లు వేస్తున్నట్లు వెల్లడించారు. మండల పరిధిలో 464 మందికి బీసీజీ వ్యాక్సిన్లు వేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 16వ తేదీ నుంచి వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందన్నారు. 2025 నాటికి పూర్తిగా క్షయవ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ బి గీతాంజలి, యడ్లపాడు పీహెచ్‌సీ వైద్యాధికారి ఎం ప్రభాకరరావు, డాక్టర్‌ బి భరద్వాజ, సీహెచ్‌వో ఎస్‌ పున్నారావు, సూపర్‌వైజర్లు వి రాజశేఖర్‌, బి గంగానమ్మ, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె అర్జునరావు యడ్లపాడు పీహెచ్‌సీ ఆకస్మిక సందర్శన క్షయవ్యాధిపై వంకాయలపాడు వాసులకు అవగాహన

Advertisement
 
Advertisement
 
Advertisement