ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు.. | Sakshi
Sakshi News home page

ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..

Published Fri, May 17 2024 5:50 AM

-

లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఓటుహక్కు వినియోగంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సామాజిక మధ్యమాల ద్వారా కొత్త ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం చేపట్టారు. ఎన్నికల విధుల్లో ఉండి ఓటుకు దూరమయ్యే వారు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు మరిన్ని వర్గాలకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించారు. వైద్యులు, మెడికల్‌ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతర ఎమర్జెన్సీ విభాగాల వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం అందించారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ఆవాసాలు, చెంచు గూడెల్లోని ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగం కోసం అదనంగా 113 పోలింగ్‌ ఉపకేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రధానంగా చెంచుపెంటల్లోనూ తాత్కాలిక పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల్లో చెంచులు, గిరిజనులు, వృద్ధులు భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా గత లోక్‌సభ ఎన్నికలకన్నా ఈసారి ఓటింగ్‌ పెంచడంలో ఎన్నికల యంత్రాగం సఫలీకృతమైంది.

Advertisement
 
Advertisement
 
Advertisement