Sakshi News home page

‘నన్ను పెళ్లి చేసుకుంటావా’? అంటే.. ఓటేస్తావా అని అడిగింది! ఆ తరువాత...?

Published Wed, Jan 24 2024 10:55 AM

Will You Marry Me: Nikki Haley Gets Proposal From Trump Supporter - Sakshi

నిక్కీ హేలీ.. ఈ పేరు అందరికీ సుపరిచితమే.. రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పోరులో బరిలో నిలిచింది. ఆఖరు వరకు పోరాడిన ఆమె చివరికి న్యూ హాంప్‌షైర్‌ రిపబ్లికన్‌ ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేతిలో ఓటమిని చవిచూసింది. అయితే తాజాగా నిక్కీకి ఓ వింత అనుభవం ఎదురైంది. సోమవారం న్యూ హాంప్‌షైర్‌ ఎన్నికల ప్రచారం చేపట్టారు. సాలేంలోని ఆర్టిసాన్‌ హోటల్‌లో ఆమె తన మద్దతుదారులనుద్దేశించి  ప్రసంగిస్తుండగా ట్రంప్ మద్దతుదారు ఆమెకు ప్రపోజ్‌ చేశాడు.. వారి మధ్య సాగిన సంభాషణ ఈ విధంగా ఉంది.

ట్రంప్‌ మద్దతుదారు: నన్ను పెళ్లి చేసుకుంటారా?( గుంపులోంచి గట్టిగా అరవడంతో అందరూ ఒక్కసారిగా ఘోల్లుమన్నారు).
నిక్కీ హేలీ: నాకు మద్దతుగా ఓటు వేస్తావా? (నవ్వుతూ)
ట్రంప్‌ మద్దతుదారు: నేను ట్రంప్‌నకు ఓటు వేయబోతున్నాను. ( హేళనగా సమాధానమిచ్చాడు)
నిక్కీ హేలీ:. అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో.

ఊహించని ఘటనతో హాల్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. ఈ సంఘటన అనంతరం నిక్కీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక భారతీయ సంతతికి చెందిన  దంపతులకు 1972లో జన్మించిన నిక్కీ ..1996లో మైఖేల్‌ హేలీని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు రెనా, నలిన్‌. గతంలో ఆమె సౌత్‌ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. ట్రంప్‌ అధ్యక్షడిగా ఉన్న సమయంలో ఐరాసలో అమెరికా రాయబారిగానూ వ్యవహరించారు.

 అమెరికా అధ్యక్ష పోరు నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తప్పుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరపున ప్రెసెడెంట్‌ ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలబడిన నిక్కీ...న్యూ హాంప్‌షైర్‌ రిపబ్లికన్‌ ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ చేతిలో ఓటమిని చవిచూశారు. ట్రంప్‌నకు మద్దతుగా 52 శాతం ఓట్లు రాగా, నిక్కీ హేలీకి 34శాతం ఓట్లు లభించాయి. దీంతో రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో నిలిచే వ్యక్తిగా ట్రంప్‌ పేరు దాదాపు ఖరారైపోయింది. కాగా ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడి  ఎన్నికలు జరగనున్నాయి.
చదవండి: USA: అధ్యక్ష రేసులో ట్రంప్‌ లైన్‌ క్లియర్‌!

Advertisement
Advertisement