అలాంటి వ్యక్తితో డేటింగ్‌ చేయడం ఇష్టం : కృతి సనన్‌ | Kriti Sanon Reveals The Reason For Wanting To Date A Desi Man, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Kriti Sanon : అలాంటి మగాడితో డేటింగ్‌ చేస్తా: కృతి సనన్‌

Published Sun, Mar 31 2024 10:45 AM

Kriti Sanon Reveals The Reason For Wanting To Date A Desi Man - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ వరుస హిట్లతో దూసుకెళ్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా'(Teri Baaton Mein Aisa Uljha Jiya) మూవీతో ఓ సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె నటించిన  క్రూ(Crew)’ చిత్రం కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇలా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ పొడుగుకాళ్ల సుందరీ.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. డేటింగ్‌ కోసం ఓ మగాడు కావాలని, అది భారతీయుడు అయితే మరీ మంచిదని అంటోది ఈ పొడుగు కాళ్ల సుందరి. 

‘శ్వేత జాతీయులు హాట్‌గా ఉండొచ్చు. కానీ నేను ఇప్పటి వరకు ఏ విదేశీయుడికి అంతగా ఎట్రాక్ట్‌ కాలేదు. నాకు భారతీయ మగాళ్లు అంటేనే ఇష్టం.  దేశీ అయిన వ్యక్తితో నేను డేటింగ్‌కు ఇష్టపడతాను. హిందీ అర్థం చేసుకునే మగాడు అయితే ఒకే. నేను ప్రతిసారి ఇంగ్లీష్‌లో మాట్లాడలేను. ఇంగ్లీష్‌ పాటలకు డ్యాన్స్‌ కూడా చేయలేను. నాతో కలిసి పంజాబీ, హిందీ పాటలకు డ్యాన్స్‌ చేసే భారతీయ మగాడు కావాలి. అలాంటి వ్యక్తితో డేటింగ్‌ చేయడానికి నేను ఇష్టపడతాను’ అని కృతి సనన్‌ చెప్పుకొచ్చింది. కాగా, కృతి సనన్‌ ఇప్పటికే ఓ ‍వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వయసులో తనకంటే 10 ఏళ్లు చిన్నవాడు, క్రికెటర్‌ ధోనీకి అత్యంత సన్నిహితుడైన  కబీర్‌ బహియాతో ప్రేమాయణం సాగిస్తుందని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement