Sakshi News home page

శ్రీరామ నవమి వేడుకలపై ‘తృణమూల్‌’ కుట్ర: ప్రధాని మోదీ

Published Tue, Apr 16 2024 4:39 PM

Pm Modi Serious Allegations On Tmc In The Eve Of Sriram Navami - Sakshi

కలకత్తా:శ్రీరామనవమి వేడుకలను అడ్డుకునేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) కుట్ర పన్నిందని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం(ఏప్రిల్‌ 16) పశ్చిమబెంగాల్‌లోని బలూర్‌ఘాట్‌లో జరిగిన ఎన్నికల సభలో మోదీ ప్రసంగించారు. ‘అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి రామనవమి వేడుక ఇది, రామ్‌నవమి వేడుకలను ఆపేందుకు టీఎంసీ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది.

ఎన్నో కుట్రలు చేస్తుంది. కానీ చివరికి నిజమే గెలుస్తుంది. ఈసారి రామ్‌నవమి వేడుకలు జరుపుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. రామ్‌నవమి ఊరేగింపు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగి తీరుతుంది. ఇందుకుగాను బెంగాల్‌ సోదరులు, సోదరీమణులకు నేను అభినందనలు తెలుపుతున్నాను’అని మోదీ అన్నారు.    

ఇదీ చదవండి.. ఈడీ, సీబీఐల దర్యాప్తు.. శ్వేతపత్రం విడుదల చేయండి: దీదీ

Advertisement
Advertisement