Sakshi News home page

మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు..

Published Wed, Apr 17 2024 9:12 AM

Election Commission Issued Notices To Ex CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మాటలు, విమర్శలపై ఎన్నికల సంఘం ఫోకస్‌ చేసింది. ఎన్నికల కోడ్‌ అతిక్రమించి ఎవరైనా మాట్లాడితే వారికి నోటీసులు ఇస్తోంది. కొందరిపై ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకుంటోంది. తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. 

వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్‌ నుంచి నోటీసులు అందాయి. నిన్న(మంగళవారం) ఈసీ నోటీసులు పంపించింది. కాగా, ఈనెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్‌ఎస్‌ సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు మేరకు ఈసీ.. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై వ్యాఖ్యలకు రేపు ఉదయం 11 గంటల వరకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 

మరోవైపు.. బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ నేతలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌, కేటీఆర్‌లపై నిరాధారమైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలోనూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. 
 

Advertisement
Advertisement