సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తు ముమ్మరం | Police Announce 2 Lakh Reward For Information Of Accused In Stone Pelting Attack On CM Jagan - Sakshi
Sakshi News home page

సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తు ముమ్మరం

Published Tue, Apr 16 2024 3:16 AM

Police Announce 2 Lakh reward Rs for Info on Stone Pelter - Sakshi

పదునైన రాయితోనే హత్యాయత్నం

వీడియో పుటేజీల ద్వారా పోలీసుల నిర్ధారణ

కాల్‌ డేటా, వీడియో రికార్డుల విశ్లేషణ

అదుపులో 60 మంది వరకు అనుమానితులు

అన్ని కోణాల్లో విచారణ.. 10 మంది తీరు సందేహాస్పదం

ఆగంతకుడి సమాచారం చెప్పినవారికి రూ.2 లక్షల బహుమతి

సున్నిత భాగాలపై తగిలితే సీఎంకు ప్రాణాపాయం ఉండేది

త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం: పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా

సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విజయవాడ సింగ్‌ నగర్‌ డాబాకొట్ల సెంటర్‌లో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మ­రం చేశారు. సింగ్‌ నగర్‌లోని వివేకానంద పాఠ­శాల ప్రాంగణం నుంచే పదునైన రాయితో హత్యా­యత్నానికి పాల్పడినట్టు వీడియో ఫుటేజీల ఆధారంగా నిర్ధారించారు. డాబా కొట్ల జంక్షన్‌ ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు, ఆ ప్రాంతంలోని పలు­వురి సెల్‌ ఫోన్లలో వీడియో రికార్డులు, హత్యాయ­త్నం చేసిన సమయంలో ఆ ప్రాంతంలో కాల్‌ డేటా­ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు సమాచారం. దాని ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.   

రౌడీషి టర్లు, బ్లేడ్‌ బ్యాచ్‌లపై ప్రత్యేక దృష్టి 
ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసులో విజయవాడ పోలీసులు పలువురు అనుమానితులను గుర్తించారు. పోలీసు రికార్డుల ప్రకారం నేర చరితులతోపాటు ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వీడియో ఫుటేజీలు, కాల్‌ డేటా ఆధారంగా దాదాపు 60 మంది వరకు  అనుమానితులను మ్యాపింగ్‌ చేశారు. వారిని పోలీసులు పిలిపించి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలో మాజీ ప్రజాప్రతినిధి వర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించే రౌడీషిటర్లు, బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠా సభ్యులు, ఇతర అసాంఘిక శక్తులపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటనకు రెండు రోజుల ముందు నుంచి వారి కాల్‌ డేటాను విశ్లేíÙస్తున్నారు. అనుమానితులు ఏయే ప్రాంతాల్లో  సంచరించింది.. వారి ఫోన్ల నుంచి ఎవరెవరికి కాల్స్‌ చేశారు.. గ్రూప్‌ కాల్స్‌ ఏమైనా మాట్లాడారా అనే కోణాల్లో సమాచారాన్ని క్రోడీకరించారు. ఆ వివరాల ఆధారంగా అనుమానితులను పలు కోణాల్లో ప్రశ్నించారు. వారు చెప్పిన సమాధానాలను కాల్‌ డేటా విశ్లేషణతోపాటు ఆ ప్రాంతంలోని వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెప్పిన వివరాలతో సరిపోలుస్తున్నారు. ఆ విధంగా పిలిపించి విచారించిన దాదాపు 60మందిలో ఓ పదిమంది తీరు సందేహాస్పదంగా ఉన్నట్టు గుర్తించారు. వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.    

డాబా కొట్ల సెంటర్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారో.. 
సీఎం జగన్‌పై హత్యాయత్నానికి డాబా కొట్ల జంక్షన్‌ ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తద్వారా ఈ కేసును ఛేదించాలని భావిస్తున్నారు. వివేకానంద స్కూల్‌ వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండటంతో యాత్ర సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తారని ఆగంతుకుడికి ముందే తెలుసు. ఆ స్కూల్‌ ప్రాంగణంలో మా­టు వేసి హత్యాయత్నానికి పాల్పడిన వెంటనే మాకి­నేని బసవపున్నయ్య స్టేడియం నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉండటం వల్లే డాబాకొట్ల ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారని ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు.

ఆ ప్రాంతంపై ఆగంతకుడికి పూర్తి పట్టు ఉండటంతో ఆ ప్రాంతానికి లేదా ఆ సమీప ప్రాంతానికి చెందిన వ్యక్తి అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని తన ఇంటికి లేదా తనకు ఆశ్రయం ఇచ్చేవారి ఇంటికి సులువుగా చేరుకుని పోలీసుల కళ్లు కప్పవచ్చనే ధీమా కూడా  ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే సింగ్‌ నగర్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని రౌడీషీటర్లు, బ్లేడ్‌ బ్యాచ్‌లు, ఇతర అసాంఘిక శక్తులపై పోలీసులు దృష్టి సారించారు. వారిలో రాజకీయ పారీ్టల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు, ప్రత్యర్థి పార్టీ వర్గీయులతో ఘర్షణ పడ్డ చరిత్ర ఉన్నవారు, గంజాయి తదితర వ్యసనాలకు బానిసైనవారు.. ఇలా పలు కోణాల్లో అనుమానితులను గుర్తించి విచారించే ప్రక్రియను వేగవంతం చేశారు. 

సమాచారమిస్తే రూ.2లక్షల బహుమతి  
ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడిన ఆగంతుకుడి సమాచారం అందిస్తే రూ.2లక్షల నగదు బహుమతి అందిస్తామని విజయవాడ పోలీసులు సోమవారం ప్రకటించారు. అగంతకుడికి సంబంధించిన సమాచారం/వీడియో, సెల్‌ఫోన్‌ ఫుటేజీ అందించినా, హత్యాయత్నాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ముందుకు వచ్చి సమాచారమిచి్చనా ఈ బహు­మతి అందిస్తామని తెలిపారు. సమాచారం ఇచి్చనవారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఆగంతకుడి సమాచారాన్ని నేరుగా లేదా ఫోన్‌/వాట్సాప్‌ ద్వారా తెలియజేయవచ్చన్నారు.  

సమాచారం అందించేందుకు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు  
కంచి శ్రీనివాసరావు, డీసీపీ 9490619342 
ఆర్‌. శ్రీహరిబాబు, ఏడీసీపీ, టాస్క్ ఫోర్స్‌: 9440627089 

Advertisement
 
Advertisement
 
Advertisement