శేషారావు సైలెంట్‌? | Sakshi
Sakshi News home page

శేషారావు సైలెంట్‌?

Published Sat, May 18 2024 10:00 AM

-

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సైతం నిడదవోలు నుంచి ఆ పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా రాజమండ్రి రూరల్‌లో ఉన్న జనసేన నేత కందుల దుర్గేష్‌కు నిడదవోలు టికెట్టు ఇచ్చారు. దీనిపై కొన్నాళ్లు వర్గవిభేదాలు కొనసాగినా.. చంద్రబాబు జోక్యంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. దుర్గేష్‌ను గెలిపించాలని తన వర్గీయులను, ప్రజలను శేషారావు కోరారు. అందుకుగాను ప్రజల కాళ్లు మొక్కుతున్నట్లు సభలో పాదాభివందనం చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఒకవేళ దుర్గేష్‌ను గెలిపిస్తే తన రాజకీయ భవిష్యత్తు ఏమిటనే ఆందోళన ఆయనను వెంటాడింది. అలా జరగడం తనకు తీరని నష్టాన్ని కలిగిస్తుందని భావించిన శేషారావు.. పోలింగ్‌కు వారం రోజుల ముందు నుంచి దుర్గేష్‌కు ఆశించిన మేర సహకారం అందించలేదని చెబుతున్నారు. పైకి మాత్రం రోజంతా ప్రచారాల్లో పాల్గొంటున్నా.. దుర్గేష్‌కు కచ్చితంగా ఓటేయాలని తన వర్గానికి శేషారావు సూచించలేదని అంటున్నారు. రాజమండ్రి సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ఓటు తమకు వేయాలని, ఎంపీ ఓటు మీ ఇష్టమని టీడీపీ రూరల్‌, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు ప్రచారం చేసినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement