‘ఉద్యోగులకు డీఏ సొమ్ము చెల్లించాలి’ | Sakshi
Sakshi News home page

‘ఉద్యోగులకు డీఏ సొమ్ము చెల్లించాలి’

Published Fri, May 17 2024 6:35 AM

-

హన్మకొండ: ఉద్యోగులకు రావాల్సిన నాలుగు డీఏల సొమ్ము వెంటనే చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ నాన్‌ గెజిటెడ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి ప్రభుత్వాన్ని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వచ్చే కేబినెట్‌ సమావేశంలో ఈ డీఏల విడుదలపై చర్చించాలని పేర్కొన్నారు. ఒకేచోట 3 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న అన్ని కేడర్ల నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులను సాధారణ బదిలీలు చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్‌ రెమ్యునషన్‌ సమానంగా ఇవ్వలేదని, దీనిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్‌ ఎన్నికల్లో పనిచేసిన ఉద్యోగులకై నా సమానంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement