డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

Published Fri, May 17 2024 7:05 AM

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 61 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ బి. సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌, రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.టి.కె.నాయక్‌ , రిజిస్ట్రార్‌ డాక్టర్‌ నాగుల అంకన్న పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం సెషన్‌లో డిగ్రీ రెండో సెమిస్టర్‌ పరీక్షలకు 9,803 మందికి 8,866, బీఈడీ మూడో సెమిస్టర్‌కు 3,306 మంది విద్యార్థులకుగాను 3,089 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో జరిగిన డిగ్రీ స్పెషల్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 60 మందికి 55 మంది, బీఈడీ మూడో సెమిస్టర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 1355 మందికి 12260 మంది విద్యార్థులు హాజరయ్యారని వర్సిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement