అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్!.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ | India Fastest Growing Economy World Bank Report, More Details Inside | Sakshi

మూడేళ్ళలో భారత్ వృద్ధి ఎలా ఉంటుందంటే?.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్

Jun 15 2024 9:40 AM | Updated on Jun 15 2024 10:58 AM

India Fastest Growing Economy World Bank Report

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో సహా వచ్చే మూడేళ్లలో 6.7 శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేయడం ద్వారా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇండియా ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని వరల్డ్ బ్యాంకు మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

భారత్ 2023-24 ఆర్థిక సంవత్సరం వృద్ధి 8.2 శాతానికి చేరుకుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఇది జనవరిలో నిపుణులు అంచనా వేసినదానికంటే 1.9 శాతం ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. 2025-26లో 2.7 శాతానికి చేరుకునే ముందు 2024లో వృద్ధి 2.6 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని పేర్కొంది.

భారతదేశంలో ప్రాంతీయ వృద్ధి కూడా గణనీయంగా పెరుగుతోంది. బంగ్లాదేశ్‌లో వృద్ధి పటిష్టంగా ఉంటుంది. అయితే పాకిస్తాన్, శ్రీలంకలు నెమ్మదిగా బలపడే సూచనలు ఉన్నాయి. ఇండియా మాత్రమే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని వెల్లడించింది.

వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం, ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల ప్రైవేట్ వినియోగ వృద్ధి ప్రయోజనం పొందుతుందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. జేడీపీకి సంబంధించి ప్రస్తుత వ్యయాన్ని తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ వినియోగం నెమ్మదిగా మాత్రమే పెరుగుతుందని అంచనా వేశారు.

ప్రపంచ ద్రవ్యోల్బణం 2024లో 3.5 శాతం.. 2025లో 2.9 శాతానికి మధ్యస్థంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ క్షీణత కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత వేగంగా పుంజుకుంటుందని.. అయితే కేంద్ర బ్యాంకులు పాలసీ వడ్డీ రేట్లను తగ్గించడంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement