బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందన్నారు. అంతేకాకుండగా మైనార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఖర్గే కామెంట్స్ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.
కాగా, మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో మీడియాతో మాట్లాడుతూ..‘దేశంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు పొరపాటున జరిగింది. మోదీకి మరో అవకాశం లేదు. ఇది మైనార్టీ ప్రభుత్వం. ఎప్పుడైనా ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. కానీ, మేము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదు. దేశ ప్రజలకు మంచి జరగడం కోసం మేము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశాన్ని పటిష్టం చేయడానికి మనం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక, ప్రధాని మోదీ మాత్రం దేశానికి మంచి జరుగుతుందంటే అది జరగనివ్వకుండా చేయడం ఆయనకు అలవాటు అంటూ విమర్శలు చేశారు. కానీ, ఇండియా కూటమి మాత్రం పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్ట పరుచుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పావులు ఏమైనా కదుపుతోందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
NDA सरकार गलती से बनी हुई है। मोदी जी के पास बहुमत नहीं है।
यह अल्पमत सरकार है, जो कभी भी गिर सकती है।
: कांग्रेस अध्यक्ष श्री @kharge pic.twitter.com/7GWmrTSPYE— Congress (@INCIndia) June 14, 2024
ఇక, ఖర్గే వ్యాఖ్యలకు జేడీయూ నేత నీరజ్ కుమార్ కౌంటరిచ్చారు. నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అందరికీ తెలిసిందే. గతంలో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ మైనార్టీ ప్రభుత్వాలను నడిపించారు కదా. అది మరిచిపోతే ఎలా అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. అలాగే, దేశ ప్రజలు మోదీ మద్దతుగా ఉన్నారు అని అన్నారు.
ఇదిలా ఉండగా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 241 స్థానాల్లో విజయం సాధించి ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 సీట్లతో ప్రతిపక్ష హోదాలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment