తమిళనాడు ఎంపీ మృతి | Sakshi
Sakshi News home page

తమిళనాడు ఎంపీ మృతి

Published Mon, May 13 2024 9:37 AM

Tamil Nadu MP M Selvaraj passes away At 67

చెన్నై: తమిళనాడు ఎంపీ ఎం.సెల్వరాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

నాగపట్నం ప్రస్తుత ఎంపీగా ఉన్న 67 ఏళ్ల ఎం. సెల్వరాజ్‌కి గతంలో కిడ్నీ మార్పిడి జరిగింది. రైతు, సామాజిక కార్యకర్త అయిన సెల్వరాజ్‌ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో అత్యంత సీనియర్‌ నేత. నాలుగు సార్లు ఎంపీగా పనిచేశారు. 1989, 1996, 1998, 2019లో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఎంపీ ఎం.సెల్వరాజ్‌ మృతికి సీపీఐ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఆయనను ఆదర్శప్రాయమైన నేతగా అభివర్ణించింది. తిరువారూర్ జిల్లాలోని సీతమల్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ తెలిపింది. కాగా ఈసారి నాగపట్నం నియోజకవర్గం నుంచి వి.సెల్వరాజ్‌ను సీపీఐ బరిలోకి దింపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement