ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపు | Sakshi
Sakshi News home page

ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపు

Published Sat, Apr 20 2024 1:25 AM

 ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ పూజారి గౌతమి
 - Sakshi

సిరిసిల్ల: జిల్లాలో మొదటి ర్యాండమైజేషన్‌ను శుక్రవారం పరిశీలించారు. సర్దాపూర్‌ గోదాంలోని ఈవీ ఎంలను శుక్రవారం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్‌ నుంచి సిరిసిల్ల, వే ములవాడ నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపు ప్రక్రియను పరిశీలించారు. పోలీసుల భద్రత మధ్య స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. సిరిసిల్ల నియోజకవర్గానికి కంట్రోల్‌ యూనిట్స్‌ 358, బ్యాలెట్‌ యూనిట్స్‌ 358, వీవీ ప్యాట్లు 401, వేములవాడ నియోజకవర్గానికి కంట్రోల్‌ యూనిట్స్‌ 325, బ్యాలెట్‌ యూని ట్స్‌ 325, వీవీ ప్యాట్లు 364 కేటాయించారు. అదనపు కలెక్టర్‌లు పూజారి గౌతమి, ఎన్‌.ఖీమ్యానా యక్‌, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీవోలు రమేశ్‌, రాజేశ్వర్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు శ్రీకాంత్‌, వివిధ రాజకీయ పక్షాల నాయకులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్య సేవలందించాలి

గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. సముద్రలింగాపూర్‌, ము చ్చర్లలోని ఆరోగ్య ఉపకేంద్రాలను తనిఖీ చేశారు. సముద్రలింగాపూర్‌లో ఏర్పాటు చేసిన దంత వైద్యశిబిరాన్ని పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో రజిత, పీవో ఉమాదేవి, మెడికల్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌, ఎంఎల్‌హెచ్‌పీలు శివాని, వనజ పాల్గొన్నారు.

పరిశీలించిన కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement
Advertisement