ఈచర్‌ వాహనాలు ఢీ: ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

ఈచర్‌ వాహనాలు ఢీ: ఒకరి మృతి

Published Fri, May 17 2024 4:55 AM

ఈచర్‌

గుడిపాల: రెండు ఈచర్‌ వాహనాలు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసరావు కథనం మేరకు, హైదరాబాద్‌ నుంచి తమిళనాడులోని చైన్నె సమీపంలోని పుదుపైటెకు ఈచర్‌ వాహనం బయల్దేరింది. చైన్నె నుంచి బెంగళూరుకు మరో ఈచర్‌ వాహనం బయల్దేరింది. ఈ రెండు వాహనాలు చైన్నె– బెంగళూరు జాతీయ రహదారిపై నరహరిపేట చెక్‌పోస్ట్‌ సమీపంలోని భద్రకాళమ్మ గుడి వద్ద ఉదయం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఇందులో పాండిచ్చేరికి చెందిన సుదర్శన్‌(32) అక్కడికక్కడే మృతి చెందాడు. షాక్‌దావిద్‌ అనే మరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్‌ సుదర్శన్‌ను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఈచర్‌ వాహనాలు ఢీ: ఒకరి మృతి
1/1

ఈచర్‌ వాహనాలు ఢీ: ఒకరి మృతి

Advertisement
 
Advertisement
 
Advertisement