Sakshi News home page

ఎవరు గెలిస్తే ఇండియాకు మేలు?

Published Sat, Apr 13 2024 12:03 AM

American politics and their influence in India - Sakshi

భారతదేశ వ్యూహాత్మక అవసరాలు తీరేందుకు జో బైడెన్ అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండటం అవసరం. అయితే డెమోక్రాట్లకు బీజేపీ అంటే అసలు పడటం లేదు. ట్రంప్‌కు బీజేపీ రాజకీయాలంటే పట్టింపేమీ లేదు కానీ.. ఎప్పుడెలా స్పందిస్తారో తెలియదు! అయితే, ట్రంప్‌ అధికారంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్‌కు జరిగిన విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. చైనాతో ట్రంప్‌ తెగదెంపులు చేసుకోవడం వల్లనే ట్రంప్‌ ప్రభుత్వం పుల్వామా, గల్వాన్ ఘటనల్లో భారత్‌కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధికారం చేపడితే ట్రంప్‌ వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేము. అలాంటి నేపథ్యంలో భారతీయ దౌత్యం అవసరం మరింత ఎక్కువవుతుంది.

అమెరికా రాజకీయాలు... భారత్‌లో వాటి ప్రభావం అన్న అంశాన్ని తీసుకుంటే నాలుగు అంశాలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి. మొదటగా చెప్పు కోవాల్సింది చైనాను నియంత్రించే విషయంలో బైడెన్ ఇండో పసఫిక్‌ ప్రాంతంలో తీసుకున్న చర్యలు. ఈ చర్యలన్నీ బాధ్యతాయుతమైనవే కాదు, ఒక పద్ధతి ప్రకారం చేసినవి కూడా. కాకపోతే ఉక్రెయిన్, గాజా యుద్ధాల కారణంగా చైనాపై శ్రద్ధ కొంత తగ్గిందనడం కూడా సత్య దూరమేమీ కాదు. బైడెన్ నేతృత్వంలో క్వాడ్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. జపాన్ తన మిలిటరీ ఆధునికీకరణ చేపట్టింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా భద్రతాంశాలపై త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చు కున్నాయి. అలాగే జపాన్, ఫిలిప్పీన్్స, అమెరికా మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది .

ఫిలిప్పీన్్సలో అమెరికా ఉనికి మరింత పెరిగింది. ‘ఆకస్‌’(ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌) ప్రకటన జరిగింది. దక్షిణ పసిఫిక్‌ ద్వీపాల ప్రాముఖ్యతనూ అమెరికా గుర్తించడం గమ నార్హం. ఆసియాన్ నేతలకు వైట్‌హౌస్‌ ఆతిథ్యమిచ్చింది. తైవాన్‌లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగింది. వియత్నాంతో అమెరికాబంధం మరింత దృఢపడింది. అలాగే చైనాపై అమెరికా కఠినమైనటెక్‌ నిషేధాలు కూడా విధించింది. ఇదే సమయంలో ఘర్షణ మరింత ముదరకుండా వ్యూహాత్మకంగా ఒకవైపు చైనాతో చర్చలు కొనసా గిస్తూనే మరోవైపు ఆ దేశంతో తన పోటీతత్వానికి మరింత పదును పెట్టింది. 

అమెరికా ఆలోచనల్లో భారత్‌ కనీసం నాలుగు విధాలుగా ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుంది. ప్రపంచస్థాయి చర్చల్లో భారత్‌ కీలక మైన భాగస్వామి అని బైడెన్ ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఈ కారణంగానే భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశాలకు పూర్తి స్థాయిలో అమెరికా మద్దతిచ్చింది. ఐఎంఈసీ, ఐ2యూ2, క్వాడ్, ఐపీఈఎఫ్, మినరల్‌ సెక్యురిటీ పార్ట్‌నర్‌షిప్, ఆర్టిమిస్‌ అకార్డ్స్‌ వంటి వేర్వేరు వ్యవస్థల్లో భారత్‌ను కీలకంగా మార్చింది. ఇంధనం నుంచి ఆహార భద్రత, వాతావరణ మార్పులు మొదలుకొని కోవిడ్‌ వంటి మహమ్మారుల నిర్వహణ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన వంటి అన్ని ప్రపంచస్థాయి సమస్యల పరిష్కారంలో భారత్‌ భూమిక తప్పదన్న విషయం కూడా అమెరికా గుర్తించింది.

భారత్‌ సామర్థ్యాన్ని పెంచడం ప్రపంచ సమస్యల పరిష్కార బాధ్యతను పంచుకోవడం అవుతుందని అమెరికా భావిస్తోంది. దీనివల్ల అటు చైనాను నియంత్రించడం, దక్షిణాసియా ప్రాంతంలో భద్రతను కాపాడటం కూడా సాధ్యమన్నది అమెరికా అంచనా. అలాగే సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం, కలిసికట్టుగా తయారీ చేపట్టడం, రక్షణ రంగంలో సహకారం, అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెడుతూండటం భారత్‌పై పెరుగుతున్న అమెరికా విశ్వాసానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. భారత్‌ భౌగోళిక స్వరూపం, ఇరుగు పొరుగు, చరిత్ర వంటి అనేక అంశాల ఆధారంగా బైడెన్ యంత్రాంగం ఈ దేశం తన ప్రయోజనాలు సాధించుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. కొన్నిసార్లు విభేదించినా భూ దక్షిణార్ధగోళం మొత్తమ్మీద భారత్‌ పరపతి చైనా కంటేఎంతో మెరుగని అమెరికా భావిస్తోంది. 

ఇక రెండో విషయానికి వద్దాం. డెమోక్రాట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీతో అంత  సౌకర్యంగా ఏమీ లేరు. ఇందుకు మూడు కారణాలు కనిపిస్తాయి. ప్రజాస్వామ్యం విషయంలో పార్టీ ధోరణి మారిపోవడం ఇందులో ఇకటి. యూఎస్‌ కాంగ్రెస్‌లోని ఐదుగురు దేశీ ప్రతినిధులు డెమోక్రాట్లే కావడం గమనార్హం. ఆధిపత్య ధోరణులకు దూరంగా ఉండాలన్న కాంక్ష, మైనారిటీలకు గుర్తింపు ఉండాలన్న భావనలు వీరిని డెమోక్రాట్‌ పార్టీ వైపు మళ్లించాయి. జాతి ఆధారిత నేషనలిజమ్‌పై కూడా వీరికి నమ్మకం లేదు. బీజేపీ ఇప్పుడు ఈ విలువలన్నింటికీ దూరమన్న అంచనా డెమోక్రాట్లలో బలపడుతోంది. రెండో కారణం అమెరికన్ ముస్లింల ప్రభావం. డెమోక్రాట్లలో భార తీయ అమెరికన్ ముస్లింల ప్రభావం కూడా క్రమేపీ ఎక్కువ అవుతోంది.

బైడెన్ గాజా విషయంలో ఇప్పటికే వీరి నుంచి కొంత వ్యతిరే కత ఎదుర్కొంటున్నారు. మిషిగన్ వంటి స్వింగ్‌స్టేట్‌లో దీని ప్రభా వమూ కనిపించింది. మూడో కారణం... డెమోక్రాట్లు ట్రంప్‌ రాజకీ యాలను వ్యతిరేకిస్తారు. ట్రంప్‌ ప్రజాస్వామ్యానికి ఎలా వ్యతిరేకం అన్న విషయంపై ఈ రాజకీయాలు మొత్తం ఆధారపడి ఉంటాయి. ఫలితంగా వీరు మానవహక్కుల వంటి విషయాలకు అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది. 

పౌరసత్వ (సవరణ) చట్టం విషయంలో ఇటీవలి కాలంలో భారత్, అమెరికా మాటా మాటా అనుకున్న విషయం ఒకసారి గుర్తు చేసుకుందాం. అయితే ఈ విషయాలన్నింటినీ తప్పుకొని మరీ పని చేసేందుకు బైడెన్యంత్రాంగం ఒక మార్గాన్ని గుర్తించింది. అంశా లను బహిరంగంగా కాకుండా, ప్రైవేట్‌గా ప్రస్తావించడం. అడపాద డపా ఎవరైనా అడిగితే నర్మగర్భంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం. అమెరికాలో భారత్‌పై ఆందోళన చెందుతున్న బీజేపీయేతర పార్టీలకు సంఘీభావ సంకేతం పంపేందుకు ఇలా చేస్తుందన్నమాట. ఉన్నతా ధికారులు, నేతలకు మాత్రం విషయం సుస్పష్టం.

మూడో అంశం... డోనాల్డ్‌ ట్రంప్‌ హ్రస్వదృష్టి. ఇందులో మైనారి టీలు, మతపరమైన అంశాలు, ఎన్నికల వ్యవస్థ చేతనావస్థ వంటి వాటికి చోటు లేదు. బహుశా క్రైస్తవుల హక్కుల గురించి ట్రంప్‌ కొంత ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సువార్తికులకు ఈయన కొంచెం తలొగ్గుతూంటారు.అధ్యక్ష ఎన్నికల్లో కొంచెం ముందున్న ట్రంప్‌ భారత్‌ ప్రయోజనా లకు అనుకూలంగా ఉంటాడని అనుకోలేము. అయితే, ట్రంప్‌ అధికా రంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్‌కు జరిగిన విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. చైనాతో ట్రంప్‌ తెగదెంపులు చేసుకోవడం వల్లనే ట్రంప్‌ ప్రభుత్వం పుల్వామా, గల్వాన్ ఘటనల్లో భారత్‌కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధి కారం చేపడితే ట్రంప్‌ వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేము.

అమెరికాలో రాజకీయపరమైన అస్థిరత, విభజన ఉండటం ఉక్రెయిన్, యూరప్‌ దేశాల నిరుత్సాహానికి తద్వారా అమెరికా ప్రత్య ర్థులకు బలాన్ని ఇస్తుంది. అందుకే అమెరికా ప్రత్యర్థులు... డెమో క్రాట్లు అంటే ఇష్టం లేని కొందరు అమెరికా స్నేహితులు కూడా ట్రంప్‌ విజయాన్ని కోరుకుంటున్నారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. బీజింగ్‌ ఇప్పటికే అమెరికా వ్యవ హారాన్ని తిరిగి మొదలుపెట్టింది. ట్రంప్‌కు సాయపడేలా ఎన్నికల్లో తప్పుడు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిందన్న వార్తలూ ఉన్నాయి. తన ప్రయోజనాలు కాపాడేలా చేస్తే వాణిజ్య పునరుద్ధరణ సాధ్యమే అని చైనా ట్రంప్‌కు సంకేతాలిచ్చినా ఆశ్చర్యం లేదు.

టిక్‌టోక్‌ విష యంలో ట్రంప్‌ తన మునుపటి వైఖరిని మార్చుకున్న విషయంఇక్కడ చెప్పుకోవాలి. అమెరికన్ రాజ్యాంగంపై పోరు చేస్తామన్నట్రంప్‌ వ్యాఖ్య, వ్యాపార వాణిజ్య వ్యవహారాల్లో దుందుడుకుతనం, ఆసియా, యూరప్‌లలోని కొన్ని మిత్రదేశాలతోనూ దురుసుగా వ్యవహరించడం వంటివి చూస్తే ట్రంప్‌ మరోసారి అధికారంలోకి వస్తే ప్రపంచం మరోసారి గందరగోళంలో పడుతుందనేది మాత్రం వాస్తవం. అలాంటి నేపథ్యంలో భారతీయ దౌత్యం అవసరం మరింత ఎక్కువవుతుంది. ఈ విషయంలో భారత్‌ ఎంతో కొంత ఆందోళనచెందాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. 
- వ్యాసకర్త జర్నలిస్ట్‌ మరియు కాలమిస్ట్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)ప్రశాంత్‌ ఝా

Advertisement
Advertisement