‘టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి’ | Sakshi
Sakshi News home page

‘టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి’

Published Sat, Dec 1 2018 3:05 PM

TRS Election Campaign In Husnabad Satishbabu - Sakshi

సాక్షి,సైదాపూర్‌: టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతోందని హుస్నాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన వెన్కెపల్లి–సైదాపూర్‌ జంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతి, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతు బీమా పథకాలు చేపట్టామన్నారు. నాలుగేళ్లలో చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. మరోసారి ఆశీర్వదిస్తే గ్రామాల్లో మిగిలిన పనులు పూర్తి చేయిస్తానన్నారు. అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, వొడితెల శ్రీనివాస్‌రావు, ప్రణవ్‌బాబు, పేరాల గోపాల్‌రావు, జెడ్పీటీసీ బిల్లా వెంకటరెడ్డి, వెన్నంపల్లి సింగిల్‌ విండో అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మునిగంటి స్వామి, కనుకుంట్ల విజయ్‌కుమార్, దేవేంద్ర, రాయిశెట్టి కోమల, చంద్రయ్య, కనుకుంట్ల కవిత, సులోచన, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రావుల రవీందర్‌రెడ్డి, జిల్లా సభ్యుడు టీ.యుగేంధర్‌రెడ్డి, బెదరకోట రవీందర్, కొండ గణేశ్, కొత్త మధుసూదన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రమణాచారి, పైడిమల్ల తిరుపతిగౌడ్, రవీందర్‌గౌడ్, బొమ్మగాని రాజు, వెంకటయ్య, నర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు. 

పాన్‌ కడుతా..ఓటు కొడతా..
హుస్నాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్‌ శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాంగంగా రాము పాన్‌ షాపులో పాన్‌ కడుతూ..ఓటు అడుగుతూ..ఆకట్టుకున్నారు. మండల కేంద్రమైన వెన్కెపల్లి–సైదాపూర్‌ జంట గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల నాయకులు సోమారపు రాజయ్య, బిల్లా వెంకటరెడ్డి, మునిగంటి స్వామి, పోలు ప్రవీణ్, బొమ్మగాని రాజు, పైడిపల్లి రవీందర్, నవీన్‌ తదితరులు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement